- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను అలా చేయడంతో కోహ్లీ నాతో మాట్లాడటం మానేశాడు : డివిలియర్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వీరిద్దరూ చాలాకాలంపాటు ఆడారు. ఇటీవల ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంలో ఏబీడీ, కోహ్లీ హగ్ చేసుకుని చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇంత మంచి ఫ్రెండ్స్ అయినా వీరిద్దరూ కొన్ని నెలలపాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని తాజాగా డివిలియర్స్ వెల్లడించాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ విషయాన్ని బహిరంగంగా చెప్పడమే దీనికి కారణమై ఉండొచ్చని చెప్పాడు.
అయితే, కొన్ని నెలల క్రితమే తనకు, కోహ్లీ మధ్య మాటలు మొదలయ్యాయని తెలిపాడు. ‘మా ఇద్దరిదీ ఒకే బోటు ప్రయాణమని నాకు తెలుసు. గత ఆరు నెలలుగా కోహ్లీ నాతో టచ్‌లో ఉన్నాడు. కోహ్లీ, అనుష్క రెండో సంతానం గురించి నేను పొరబడ్డాను. దాని తర్వాత అతను మళ్లీ నాతో మాట్లాడటం నాకు ఊరట అనిపించింది.’ అని తెలిపాడు.
విరాట్ టెస్టు రిటైర్మెంట్‌పై స్పందిస్తూ..‘అతను కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. బ్యాన్స్ బ్యాక్ అవడానికి నన్ను సలహా అడిగాడు. అతని వయసు, ఆడిన మ్యాచ్‌లు పరిగణలోకి తీసుకున్న తర్వాత అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నాకు అర్థమైంది. అతని ఆటను చూసిన తర్వాత నాకు అనిపించింది అతనికి చెప్పాను. అయితే, అతను ఇంకా క్రికెట్ ఆడటం నాకు ఆనందంగా ఉంది. 100 శాతం అతనికి మద్దతుగా ఉంటా.’అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు కోహ్లీ గైర్హాజరయ్యాడు. అప్పుడు అనుష్క ప్రెగ్నెంట్ అని డివిలియర్స్ తెలిపాడు. మరో వీడియోలో తాను పొరబడ్డానని ఏబీడీ వివరణ ఇచ్చాడు.






