గంభీర్ ప‌రువు తీసిన ఆసీస్ క్రికెట‌ర్‌..ఇలా అయితే టీమిండియా నాశ‌న‌మే ?

by velandi.Saikiran |

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ కూడా దీనిపై స్పందించాడు. గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయాలు తనకు అస్సలు అర్థం

గంభీర్ ప‌రువు తీసిన ఆసీస్ క్రికెట‌ర్‌..ఇలా అయితే టీమిండియా నాశ‌న‌మే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆస్ట్రేలియా గడ్డపై టి20 సిరీస్ ఆడుతున్న టీమిండియా అత్యంత దారుణ‌మైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా, రెండో టి20లో కూడా ఓడిపోయింది. దీంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రెండో టీ20లో గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఆయన వల్లే టీమిండియా ఓడిపోయిందని మండిపడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ కూడా దీనిపై స్పందించాడు.

గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయాలు తనకు అస్సలు అర్థం కావడం లేదు... ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కానీ సక్సెస్ కావడం లేదని ఆరోన్‌ ఫించ్‌ పెదవి విరిచారు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడని మండిపడ్డారు. దానివల్ల టీమిండియా దెబ్బతింటుందని హెచ్చరించాడు. అదనపు బ్యాటర్ కోసం అర్షదీప్ లాంటి డేంజర్ బౌలర్ ను పక్కకు పెట్టడం పెద్ద తప్పిదం అంటూ వ్యాఖ్యానించారు. మూడో టి20 లోనైనా అర్షదీప్ సింగ్ ను ఆడించాలి, లేకపోతే మీ కర్మ అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాలు టీమ్ ఇండియాకు సెట్ కావని చుర‌క‌లు అంటించారు. ఇకనైనా గౌతమ్ గంభీర్ మారాలని కోరారు.

Next Story