- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్ చెత్త బ్యాటింగ్ వల్లే భారత్ ఓటమి...మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్ చేతిలో భారత్ మూడో వన్డే ఓడిపోవడానికి కారణం కెప్టెన్ గిల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ చేతిలో భారత్ మూడో వన్డే ఓడిపోవడానికి కారణం కెప్టెన్ గిల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. అందరూ అతనిపై ఆశలు పెట్టుకుంటే.. నట్టేట ముంచాడని ఫైర్ అయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ లో బ్లాక్ క్యాప్స్ పై చేయి సాధించారు. రెండు వన్డేలు వరుసగా గెలిచి, మన గడ్డపై టైటిల్ గెల్చుకున్నారు. దీంతో భారత ప్రదర్శన పై దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి.
భారత్ ఓటమికి గిల్లే కారణం
ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ను ఆడుకుంటున్నారు జనాలు. ఇలాంటి నేపథ్యంలోనే భారత్ ఓటమిపై ఆకాష్ చోప్రా స్పందించారు. భారత ఓటమికి కారణం గిల్ అంటూ మండిపడ్డారు. మొదటి రెండు వన్డేలో అర్థ సెంచరీ చేసిన గిల్, కీలకమైన మూడో వన్డేలో అట్టర్ ఫ్లాఫ్ అయినట్లు మండిపడ్డారు. చెత్త షాట్ ఆడి, వికెట్ సమర్పించుకున్నాడని చురకలు అంటించారు. 337 పరుగుల లక్ష్యం ఉన్నప్పుడు కెప్టెన్ కాస్త జాగ్రత్తగా ఆడాలని హితువు పలికారు. కాగా చివరి వన్డేలో 23 పరుగులకు ఔట్ అయ్యాడు గిల్.






