ఇవాళ ఐపీఎల్ ఫ్యాన్స్‌కి స్పెషల్ డే.. నేటితో 18 ఏళ్లు పూర్తి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-18 08:43:59  IST  )

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18 సీజన్ నడుస్తోంది.

ఇవాళ ఐపీఎల్ ఫ్యాన్స్‌కి స్పెషల్ డే.. నేటితో 18 ఏళ్లు పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18 సీజన్ నడుస్తోంది. ప్రతీ మ్యాచు ఉత్కంఠభరితంగా సాగుతూ.. ఫ్యాన్స్‌కి పూర్తి ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. ఇవాళ ఐపీఎల్ ఫ్యాన్స్‌కి అత్యంత ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే.. ఇవాళ్టితో ఐపీఎల్ తన 18 ఏళ్ల రగ్గడ్ జర్నీ పూర్తి చేసుకుంది. 2008లో సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 18) ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక తొలి సీజన్ నుంచి క్రికెట్ ప్రేమికులను ఎంటర్టైన్ చేస్తూ, ప్రతీ సీజన్​లో అభిమానులను పెంచుకుంటూ పోతోంది. అంతేకాదు, ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన లీగ్‌గా మారింది.

ప్రతి ఏటా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్ కేవలం ఆట మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ ఫెస్టివల్. ఈ 18 ఏళ్లలో ఊరూరా టాలెంట్‌ని వెలికితీసి, గల్లీ క్రికెటర్లను గ్లోబల్ స్టార్లుగా మార్చేసింది. అందుకే ఈ లీగ్​లో ఆడేందుకు దేశవిదేశాల్లోని అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం మొగ్గు చూపుతారు. ఇక ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. లీగ్‌లో ఆటగాళ్లు మారగా, కొన్ని నిబంధనలూ మారాయి. ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 2025 సీజన్‌లో ఐపీఎల్ మరింత ఆకర్షణీయంగా, భారీ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది.

ఇక తొలుత ఐపీఎల్ 8 జట్లతోనే ప్రారంభమైంది. అయితే, ఆ తర్వాత ఆయా సీజన్లలో ఒకటి, రెండు జట్లు వచ్చి వెళ్లాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో 10 జట్లు పోటీపడుతున్నాయి. అవి.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT).

2008లో కోల్​కతా నైట్​రైడర్స్ (KKR)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)​ మధ్య తొలి పోరుతో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్​కు తెరలేచింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్​కతా 20ఓవర్లలో 222 పరగుల భారీ స్కోర్ నమోదు చేయగా, ఆర్సీబీ ఛేదనలో 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్​ చరిత్రలోనే కేకేఆర్ తొలి విజయం అందుకున్న జట్టుగా నిలిచింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరిస్తూ ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ముందు కూడా ఇది మరిన్ని రికార్డులు బద్దలు కొడుతూ, అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు. మరీ ఐపీఎల్‌లో ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏది?

ఇప్పటి వరకు ఐపీఎల్‌ విజేతలు..

* రాజస్తాన్‌ రాయల్స్‌ (2008)

* డెక్కన్‌ చార్జర్స్‌ (2009 )

* చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2010, 2011, 2018, 2021, 2023)

* కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (2012, 2014, 2024)

* ముంబై ఇండియన్స్‌ (2013, 2015, 2017, 2019, 2020)

* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2016 )

* గుజరాత్‌ టైటాన్స్‌ (2022)

Next Story