ఐదో టీ20లో ఊచ‌కోత‌, ప్రియురాలికి పాండ్యా ఫ్లయింగ్ కిస్ !

by velandi.Saikiran |

నాలుగు బౌండరీలు బాదిన హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ అయి

ఐదో టీ20లో ఊచ‌కోత‌, ప్రియురాలికి పాండ్యా ఫ్లయింగ్ కిస్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య చివరి టీ20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి, ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 5 వికెట్లు నష్టపోయి 231 పరుగులు సాధించింది. ఇంత స్థాయిలో భారత జట్టు స్కోర్ చేయడం వెనుక, పాండ్యా విరోచిత ఇన్నింగ్స్ ఉంది. ఈ మ్యాచ్ లో కేవలం 25 బంతులు ఎదుర్కొని 63 పరుగులు సాధించాడు పాండ్యా.

అంతేకాదు, ఈ మ్యాచ్ లో 5 సిక్సర్లు, నాలుగు బౌండరీలు బాదిన హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ అయిన తర్వాత, తన ప్రియురాలు మహికా శర్మకు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. చిత్త చివరి టీ20 నేపథ్యంలో తన ప్రియురాలిని కూడా స్టేడియానికి తీసుకువచ్చాడు పాండ్యా. ఈ నేపథ్యంలోనే అర్థ సెంచరీ పూర్తికాగానే ఆమెను ఉద్దేశిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అటు వెంటనే మహిక శర్మ కూడా రియాక్ట్ అయి, ఆమె కూడా గాల్లో ముద్దులు పెట్టేసింది. ఈ ఫోటో వైరల్ గా మారింది.

Next Story