- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ కోసం తెల్లటి పావురాలు.. చిన్నస్వామిలో అరుదైన ఘటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) పునః ప్రారంభం నేపథ్యంలో... విరాట్ కోహ్లీకి ( Virat Kohli) అరుదైన గౌరవ

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) పునః ప్రారంభం నేపథ్యంలో... విరాట్ కోహ్లీకి ( Virat Kohli) అరుదైన గౌరవం దక్కింది. శనివారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) వర్సెస్ కేకేఆర్ ( KKR) మధ్య మ్యాచ్ జరగాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే... చిన్నస్వామి స్టేడియంపై ( Chinnaswamy ) నుంచి తెల్లటి పావురాలు ( white pigeons)... ఒకసారిగా ప్రత్యక్షమయ్యాయి.
స్టేడియం చుట్టూ ఒక రౌండ్ వేసి వెళ్లిపోయాయి. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... తెల్లటి పావురాలు కూడా వచ్చి, తమ వంతుగా కోహ్లీకి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు చిన్నస్వామి స్టేడియానికి పావురాలు వచ్చాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ కోసమే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఇలా పావురాలను ఎగురవేసిందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి వర్షం కొడుతున్న సమయంలో ఆ తెల్లటి పావురాలు ఆకాశంలో ఎగురుతుంటే నిజంగానే విరాట్ కోహ్లీ కోసమే వచ్చినట్లే అనిపించింది. అదే సమయంలో స్టేడియం మొత్తం విరాట్ కోహ్లీ టెస్ట్ జెర్సీ ధరించి... మెరిసారు అభిమానులు. అయితే మ్యాచ్ కు వర్షం అడ్డంకి రావడంతో.... వాళ్ల జెర్సీలు పెద్దగా హైలెట్ కాలేదు. ఇది ఇలా ఉండగా వర్షం కారణంగా కేకేఆర్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో చెరో పాయింట్ వచ్చింది. దీంతో.. కేకేఆర్ ఇంటికి వెళ్లగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాయింట్లు పట్టికలో మొదటి స్థానానికి చేరుకొని.. ప్లే ఆఫ్ కు వెళ్ళింది.
A flock of white pigeons soaring above Chinnaswamy — a rare moment of peace and beauty amidst the roar of the game.#RCBvsKKR pic.twitter.com/5dc61Aqjyu
— Manni (@ThadhaniManish_) May 17, 2025






