- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఇకపై ‘Zee’ నెట్‌వర్క్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు
ఫిఫా వరల్డ్ కప్ -2026 ప్రసారాలపై ‘జీ’ నెట్‌వర్క్ అధికారిక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా పండుగ ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) భారతీయ ప్రసార హక్కులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ప్రముఖ భారతీయ మీడియా దిగ్గజం ‘జీ’ (Zee) నెట్‌వర్క్ రాబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసార హక్కులను దక్కించుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA)తో జీ నెట్‌వర్క్ 8 ఏళ్ల సుదీర్ఘ కాలానికి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ తాజా ఒప్పందంతో కేవలం 2026 వరల్డ్ కప్‌కే పరిమితం కాకుండా 2030 పురుషుల ఫిఫా వరల్డ్ కప్‌లు, 2027 ఫిఫా మహిళల వరల్డ్ కప్‌తో పాటు 2034 వరకు జరిగే అన్ని రకాల ఫిఫా అండర్-17, అండర్-20, ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ల ప్రసార హక్కులను కూడా ‘జీ’ సొంతం చేసుకుంది.
అయితే, జియోస్టార్ (JioStar), ఫిఫా మధ్య నిధుల విషయంలో సయోధ్య కుదరకపోవడంతో ‘జీ’ రంగంలోకి దిగి ఈ భారీ డీల్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం జీ సంస్థ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లను రీ-బ్రాండ్ చేస్తూ హిందీలో ‘యునైట్8 స్పోర్ట్స్ 1’, ‘యునైట్8 స్పోర్ట్స్ 1 HD’, ఇంగ్లీష్‌లో ‘యునైట్8 స్పోర్ట్స్ 2’, ‘యునైట్8 స్పోర్ట్స్ 2 HD’ ఛానళ్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది. ఇక జూన్ 11 నుంచి అమెరికా, మెక్సికో, కెనడా వేదికలుగా 48 జట్లతో ఫిఫా వరల్డ్ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది.






