- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రితో సరదాగా గ్రౌండ్‌కు వెళ్లి తను స్టార్ అయ్యాడు
తండ్రితో సరదాగా గ్రౌండ్‌కు వెళ్లిన ఓ కుర్రాడు తనే స్టార్ అయ్యాడు. తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్‌కు వెళ్లగా టేబుల్ టెన్నిస్‌లో అతడి ప్రతిభ చూసి తండ్రి అవాక్కయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: తండ్రితో సరదాగా గ్రౌండ్‌కు వెళ్లిన ఓ కుర్రాడు తనే స్టార్ అయ్యాడు. తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్‌కు వెళ్లగా టేబుల్ టెన్నిస్‌లో అతడి ప్రతిభ చూసి తండ్రి అవాక్కయ్యాడు. కొడుకు అభిరుచి చూసి శిక్షణ ఇప్పించగా గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు అండర్ 13 విభాగంలో తెలంగాణలోనే నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఆ కుర్రాడి పేరే టి. విరాట్ సాగర్. 2024-2025 సంవత్సరానికి గాను జరిగిన స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో విరాట్ సాగర్ పతకాల పంట పండించాడు. స్టేట్ ర్యాకింగ్ టోర్నమెంట్లలో ఏకంగా 5గోల్డ్ మెడల్స్ సాధించగా లీగ్ టోర్నమెంట్‌లలోనూ అద్భుతంగా రాణిస్తూ సుమారు 10 గోల్డ్ మెడల్స్ సాధించాడు.
ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ క్రీడలో అండర్ 13 విభాగంలో విరాట్ తెలంగాణలో నంబర్.1 ర్యాంక్‌లో ఉన్నాడు. విరాట్ తండ్రి క్రికెట్ ఆటగాడు కావడంతో మొదట్లో కూకట్‌పల్లిలోని పింగ్ పాంగ్ అకాడమీకి విరాట్ సరదాగా వెళ్లి ఆడేవాడు. ఈ క్రమంలో కొడుకు స్కిల్స్ గమనించిన తండ్రి శిక్షణ ఇప్పించాడు. ఈ క్రమంలో 2024లో జాతీయటోర్నమెంట్‌లో పోటీపడ్డ విరాట్ జాతీయక్రీడాకారుడు సుచేత్‌పై విజయం సాధించి మోయిన్ డ్రా కు క్వాలిఫై అయ్యాడు. మొదట్లో విరాట్ శుభంకర్ అనే కోచ్ వద్ద ప్రాక్టీస్ చేయగా ప్రస్తుతం అంతర్జాతీయ టెన్నిస్ కోచ్ సోమనాథ్ ఘోష్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించి భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడటమే తన లక్ష్యం అని విరాట్ చెబుతున్నాడు.






