- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెస్‌లో చరిత్ర సృష్టించిన 9 ఏళ్ల బాలుడు.. తొలి భారతీయుడిగా రికార్డు
by Harish |
ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల ఆరిత్ కపిల్ చదరంగంలో చరిత్ర సృష్టించాడు.

X
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల ఆరిత్ కపిల్ చదరంగంలో చరిత్ర సృష్టించాడు. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతిపిన్న భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. కేఐఐటీ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఆరిత్ ఈ ఘనత సాధించాడు. సోమవారం జరిగిన 9వ రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ రాసెట్ జియత్‌దినొవ్‌ను ఓడించాడు. 63 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఆరిత్ వయస్సు 9 ఏళ్ల 2 నెలల 18 రోజులు. మొత్తంగా వరల్డ్ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన మూడో అతి పిన్న వయస్కుడిగా ఆరిత్ నిలిచాడు. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతిపిన్న వయస్కుడి రికార్డు సింగపూర్‌కు చెందిన అశ్వత్ కౌశిక్(8 ఏళ్ల 2 నెలలు) పేరిట ఉంది. ఈ ఏడాది అతను ఈ ఫీట్ సాధించాడు. కౌశిక్ భారత సంతతికి చెందినవాడే కావడం విశేషం.ఈ నెలలో జరగబోయే అండర్-13 జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆరిత్ పాల్గొననున్నాడు.
Next Story






