- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైనల్స్ కు RCB.. ఏకంగా 9 "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డ్స్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్ కి చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఈ సారి సీజన్ లో చాలా బలంగా కనిపిస్తోంది. గత 17

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్ కి చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఈ సారి సీజన్ లో చాలా బలంగా కనిపిస్తోంది. గత 17 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చాలా వీక్నెస్ గా ఉండేది. విరాట్ కోహ్లీ ఒక్కడు ఆడితే... మ్యాచ్ గెలిచేది. ఒకవేళ విరాట్ కోహ్లీ ఔట్ అయితే చాలు అందరూ క్యూ కట్టేవారు. క్రిస్ గేల్ అలాగే ABఫైనల్స్ కు RCB.. ఏకంగా 9 "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డ్స్ డివిలియర్స్ ఇలాంటి భయంకరమైన ఆటగాళ్లు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. బ్యాటింగ్ సరిగ్గా చేస్తే బౌలింగ్ చేసేవారు.
బౌలింగ్ సరిగ్గా చేస్తే బ్యాటింగ్ చేతులెత్తేసేవారు. అలా 17 సంవత్సరాలుగా నెట్టుకుంటూ వచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కానీ 18వ సీజన్ లో మాత్రం.. పాత ఆస్ట్రేలియా జట్టు తరహాలో కనిపిస్తోంది. ఒక ఆటగాడు కాకపోతే మరొక ఆటగాడు రాణించి జట్టును గెలిపిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలను బయటపడకుండా... మెరుగ్గా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చుతున్నారు ఆటగాళ్లు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బెంగళూరు జట్టులో ఉన్న తొమ్మిది మందికి ఈ సీజన్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ వచ్చాయి. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఆటగాడికి ఈ అవార్డ్స్ దక్కాయి. ఇందులో బౌలర్లు, బ్యాటర్స్, ఆల్రౌండర్స్ ఉన్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. తాజాగా క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో సూయష్ శర్మ అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
Krunal won POTM
— Johns. (@CricCrazyJohns) May 29, 2025
Patidar won POTM
Salt won POTM
Tim David won POTM
Kohli won POTM
Hazlewood won POTM
Romario won POTM
Jitesh won POTM
Suyash won POTM
9 DIFFERENT POTM WINNERS FOR RCB IN IPL 2025 👑 pic.twitter.com/4BWYqrPlYv






