76 ఏళ్ల బాడ్మింటన్‌ హీరో..అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు!

by Phanindra |

76 ఏళ్ల వయసులో కూడా బాడ్మింటన్‌ రాణిస్తున్నాడు రాజలింగు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

76 ఏళ్ల బాడ్మింటన్‌ హీరో..అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు!
X

దిశ, స్పోర్ట్స్: బాడ్మింటన్‌లో అద్భుతమైన నైపుణ్యంతో 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే బాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడు పల్లెం రాజలింగు. ఇటీవల గోవాలో జరిగిన టోర్నీలో గెలుపొంది వచ్చే నెల అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఆటలకు ఎంపికయ్యాడు. కానీ ఆ పోటీలకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయని చెప్పాడీ మాజీ సింగరేణి కార్మికుడు.

ఎలాంటి శిక్షణ లేకుండానే 300కు పైగా పోటీల్లో సత్తాచాటాడు. కోల్ ఇండియాలో నిర్వహించిన బాడ్మింటన్ టోర్నీలో సత్తాచాటాడు. 2008లో ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో రాణిస్తూ.. 76 ఏళ్ల వయసులోనూ యువకులకు పోటీ ఇస్తున్నాడు. జాతీయ స్థాయి టోర్నీల్లో రాణిస్తూ స్వీడన్ దేశవాళి టోర్నీకి, పోలాండ్‌ మాస్టర్స్ బాడ్మింటన్ పోటీలకు కూడా అర్హత సాధించాడు.

అయితే ఆర్ధిక ఈ టోర్నీలకు వెళ్లలేకపోయాడు. తాజాగా గోవాలో జరిగిన పోటీల్లో విజయం సాధించిన ఆయన.. ఆగస్టులో థాయిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ షటిల్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ పోటీలకైనా వెళ్లడానికి రాజలింగుకు తెలంగాణ సర్కారు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.

Next Story