41 ఏళ్ల వయసులో డివిలియర్స్ ఫీల్డింగ్... స్టన్నింగ్ క్యాచ్

by velandi.Saikiran |

సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు AB డివిలియర్స్ ( AB De Villiers) గురించి తెలియని వారు ఉండరు. 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన

41 ఏళ్ల వయసులో డివిలియర్స్ ఫీల్డింగ్... స్టన్నింగ్ క్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు AB డివిలియర్స్ ( AB De Villiers) గురించి తెలియని వారు ఉండరు. 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన.. AB డివిలియర్స్ ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడు. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ లో... బరిలోకి దిగుతున్నాడు ఏబి డివిలియర్స్. ఈ టోర్నమెంట్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా చాంపియన్స్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే... తాజాగా AB డివిలియర్స్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. WCL 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చాంపియన్స్ కెప్టెన్ ఏబి డివిలియర్స్ అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 30 పంతులు లోనే 63 పరుగులు చేసిన 360 డిగ్రీ ప్లేయర్ AB డివిలియర్స్... ఫీల్డింగ్ లో కూడా దుమ్ము లేపాడు.

యూసఫ్ పఠాన్ లాంగ్ ఆఫ్ వైపు భారీ షాట్ ఆడాడు. అయితే ఈ తరుణంలోనే... బౌండరీ లైన్ వద్ద డివిలియర్స్ డైవ్ చేస్తూ బంతిని పట్టుకొని గాల్లోకి విసిరాడు. దీంతో పక్కనే ఉన్న మరో ప్లేయర్ ఆ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 41ఏళ్ళ వయసులో కూడా AB డివిలియర్స్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో 88 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

Twitter Link

Next Story