- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND vs SA: కుప్పకూలిన టాప్ ఆర్డర్.. ఫాలోఆన్ గండంలో టీమిండియా
ఇండియా–సౌతాఫ్రికా రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటియాస్ జట్టు 489 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా–సౌతాఫ్రికా రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటియాస్ జట్టు 489 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, ముతుసామీ సెంచరీతో, జన్సెన్ 93 పరుగులతో మెరవడం కీలకంగా నిలిచింది. జవాబుగా భారత్ రెండో రోజు స్టంప్స్ వరకు 9/0తో నిలిచి, ఇంకా 480 పరుగుల వెనుకబాటుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత జట్టుకు బౌలర్లు షాక్ ఇచ్చారు. ఓపెనర్లు మొదటి వికెట్ కు 65 పరుగులు బాగా స్వామ్యం అందించగా.. 65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు.
అనంతరం జైస్వాల్ అర్ధ సెంచరీ చేసిన తర్వాత 95 పరుగుల వద్ద రెండో వికెట్ గా వెనుదిరిగాడు. అలాగే వెంట వెంటనే భారత బ్యాటర్లు అవుట్ అయ్యారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 44 ఓవర్లు ముగిసే సమయానికి 122 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా 6, సుందర్ 3 పరుగులతో ఉన్నారు. దీంతో భారత్ 367 పరుగుల వెనుకంజలో ఉంది. ఇలానే వికెట్లు కోల్పోతే భారత్ ఫాల్ ఆన్ ప్రమాదంలో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా ఈ మ్యాచులో సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యూన్సేన్ 3 వికెట్లు, సైమన్ 2 వికెట్లు తీసుకున్నారు.






