టీ20 క్రికెట్‌లో సంచలనం.. ఒక్క బంతికి 22 రన్స్.. ఎలా వచ్చాయో తెలుసా?

by Harish |

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ చరిత్ర సృష్టించాడు.

టీ20 క్రికెట్‌లో సంచలనం.. ఒక్క బంతికి 22 రన్స్.. ఎలా వచ్చాయో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ చరిత్ర సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)‌లో అతను సృష్టించిన చరిత్ర ఎవరూ ఊహించనది. ఒకే ఒక్క బంతికి షెఫర్డ్ 22 పరుగులు రాబట్టాడు. ఒక్క బంతికి అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సీపీఎల్‌లో షెఫర్డ్ గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం సెయింట్ లూసియాతో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు.

బౌలర్ ఒషానె థామస్ వేసిన 15వ ఓవర్‌లో మూడో బంతిని అతను నో బౌల్ వేశాడు. ఆ బంతికి రన్స్ ఏం రాలేదు. ఆ తర్వాత ఫ్రీ హిట్‌ను వైడ్‌గా వేశాడు. మళ్లీ వేసిన ఫ్రీ హిట్‌ను షెఫర్డ్ సిక్సర్‌‌గా కొట్టాడు. అది కూడా నో బాల్ కావడంతో మరో ఫ్రీ హిట్ వచ్చింది. ఆ బంతిని కూడా సిక్స్‌గా మలిచాడు. ఆ బాల్ కూడా నో బాల్‌గా తేలింది. మూడో ఫ్రీ హిట్‌‌ను షెఫర్డ్ మరోసారి బౌండరీ ఆవలకు తరలించాడు. అది లీగల్ డెలివరీ కాగా మొత్తంగా ఒక్క బంతికి 22 రన్స్(1నోబాల్, 1వైడ్, 7నోబాల్, 7నోబాల్, 6) వచ్చాయి. మొత్తంగా ఆ ఓవర్‌లో 33 రన్స్ వచ్చాయి. ఆ మ్యాచ్‌లో షెఫర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, షెఫర్డ్ పోరాటం వృథా అయ్యింది. 203 పరుగుల భారీ లక్ష్యాన్ని గయానా కాపాడుకోలేకపోయింది. ఆ లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లే కోల్పోయి ఛేదించింది.


Next Story