- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గౌతమ్ గంభీర్‌ను బెదిరించిన కేసులో ట్విస్ట్..ఆ అఘాంతకుడు అరెస్ట్
టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ( Gambhir threat case) చంపేస్తానంటూ వచ్చిన బెదిరింపుల ఘటనలో కీలక పరిణామం

దిశ, వెబ్ డెస్క్: టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ( Gambhir threat case) చంపేస్తానంటూ వచ్చిన బెదిరింపుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్ ను ( Gambhir) చంపేస్తానంటూ బెదిరించిన కేసులో ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తి గుజరాత్‌కు ( Gujarat) చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ గా ( Jignesh Sinh Parmar ) గుర్తించారు ఢిల్లీ పోలీసులు ( Delhi Police).
'ఐసిస్ కాశ్మీర్' (ISIS Kashmir ) అనే మెయిల్ ఐడీతో 'ఐ కిల్ యూ' అంటూ గౌతమ్ గంభీర్ ను బెదిరించాడు. ఈ తరుణంలోనే ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు... ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కేసులో అరెస్ట్ అయిన జిగ్నేశ్ కుటుంబ సభ్యులు మాత్రం.. దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. తమ కుమారుడు జిగ్నేశ్ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని, అతని మతిస్థిమితం సరిగా ఉండటం లేదంటే చెబుతున్నారు.
అందుకే గౌతమ్ గంభీర్ ను చంపేస్తానని బెదిరించినట్లు తన కుమారుడిని వెనుకేసుకు వస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో ఆహ్ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట... తనను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు గౌతమ్ గంభీర్. తనకు అలాగే తన కుటుంబానికి.. ప్రత్యేక సెక్యూరిటీ ఇవ్వాలని... ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఆయన కేసు పెట్టిన 24 గంటల్లోపే కేసు ఛేదించారు పోలీసులు.






