2030 కామన్ వెల్త్ గేమ్స్ @అహ్మదాబాద్

by Muthe.Rajitha |

2030 లో జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్ కు వేదిక ఖరారైంది.

2030 కామన్ వెల్త్ గేమ్స్ @అహ్మదాబాద్
X

దిశ, వెబ్ డెస్క్ : 2030 లో జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్ కు వేదిక ఖరారైంది. మనదేశంలోని గుజరాత్ లో గల అహ్మదాబాద్ లో ఈ గేమ్స్ జరగనున్నాయి. స్కాట్లాండ్ లోని గ్లాస్గో జరిగిన కామన్ వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్ కు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష అందుకున్నారు.

కాగా ఇండియాలో జరగబోయే ఈ ఈవెంట్ లో 15 నుంచి 17 స్పోర్ట్స్ ఉండబోతున్నాయి. అయితే వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్ వెల్త్ గేమ్స్ లో మాత్రం 10 క్రీడాంశాలు మాత్రమే ఉండనున్నాయి. ఇక 2030 లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్ శతాబ్ది క్రీడా ఉత్సవాలు కావడం విశేషం.

Next Story