- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్, విరాట్ లకు 2027 ప్రపంచ కప్ డెస్టినీ పరీక్ష
భారత క్రికెట్ జట్టులో దిగ్గజాలు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు తమ క్రికెట్ భవిష్యత్తుపై వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ జట్టులో దిగ్గజాలు అయిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీలకు తమ క్రికెట్ భవిష్యత్తుపై వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 2027 వన్డే ప్రపంచ కప్ అవకాశాలను నిర్ణయించే అత్యంత కీలకమైన 'ఆడిషన్' రేపటి నుంచి ప్రారంభం కానుంది. వన్డే జట్టులో అత్యంత బలంగా ఉన్న దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ (Three-match ODI series)లో భారత్ తలపడనుండగా, ఈ సిరీస్ ద్వారా జాతీయ జట్టులో ఉన్న కొన్ని ఎంపికల గందరగోళాన్ని పరిష్కరించాలని టీమిండియా చూస్తోంది.
ఆధునిక క్రికెట్‌లో లెజెండ్‌లుగా వెలుగొందుతున్న రోహిత్, విరట్ కోహ్లీ (Virat Kohli) ఇద్దరూ ప్రస్తుతం కేవలం వన్డే ఒక్క ఫార్మాట్‌లో మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. రాబోయే రెండు నెలల్లో భారత్ కేవలం ఆరు వన్డేలు (దక్షిణాఫ్రికా మూడు, జనవరిలో న్యూజిలాండ్‌పై మూడు) మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో, ఈ ఆరు వన్డేల్లో వారి ప్రదర్శన 2027 ప్రపంచ కప్ రోహిత్, కోహ్లీల భవితవ్యాన్ని నేరుగా ప్రభావితం చేయనుంది. ఈ ప్రదర్శనలు వారి కెరీర్‌లను పొడిగించగలవు. అలాగే వారి కేరీర్‌ను అనివార్యమైన ముగింపు (సన్సెట్) వైపు నెట్టగలవు. ఈ సిరీస్ ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు అత్యంత కీలకమైన పరీక్షగా మారనుంది.
ఇదిలా ఉంటే ఈ మూడు వన్డేల సిరీస్ తో పాటు 2027 వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) లక్ష్యంగా రోహిత్ శర్, విరాట్ కోహ్లీలు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ పూర్తి ఫిట్ నెస్ సాధించి పదేళ్ల క్రితం ఎలా ఉన్నాడో అలా స్లిమ్ గా అయ్యాడు. మరోపక్క విరాట్ కోహ్లీ కూడా పూర్తి ఫిట్ గా ఉన్నాడు. కానీ ఇటీవల జరిగిన వన్డే మ్యాచులో వారి ప్రదర్శన ఆశించినంతగా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరగనున్న వన్డే సిరీస్ పై రోహిత్, కోహ్లీల అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.






