- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది...మోడీ స్టేడియంలోనే ఫైనల్ !
2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో... క్రికెట్ అభిమానుల కోసం మరో అదిరిపోయే శుభవార్త వచ్చింది. పురుషుల టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్... అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మెగా టోర్నమెంట్ శ్రీలంక అలాగే టీమిండియా రెండు దేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు కూడా పాల్గొంటుంది కాబట్టి.. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ కు వస్తే మోడీ స్టేడియంలో ఫైనల్ ఉంటుందా? లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దాదాపు వేదిక మారే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇక ఈ మెగా టోర్నమెంట్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో జరుగుతుంది. అందుకే టి20 వరల్డ్ కప్ ముందుగానే ఫినిష్ చేయాలని.. ఐసీసీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.






