క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే రోజు రెండు భారత్, పాక్ మ్యాచ్‌లు

by Harish |

క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే రోజు రెండు భారత్, పాక్ మ్యాచ్‌లు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ పోరు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా. ఎదురుచూస్తుంటారు. ఫిబ్రవరి 15న రెండు భారత్, పాక్ మ్యాచ్‌లను చూడొచ్చు. టీ20 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 15న దాయాదుల పోరు జరగనున్న విషయం తెలిసిందే. మరో మ్యాచ్ అదే రోజు మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌ టోర్నీలో జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఈ టోర్నీ షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు టోర్నమెంట్ జరగనుంది.

ఇందులో భారత్ ‘ఏ’, పాకిస్తాన్ ‘ఏ’, యూఏఈ, నేపాల్, బంగ్లాదేశ్ ‘ఏ’, శ్రీలంక ‘ఏ’, మలేసియా, థాయిలాండ్ జట్లు పాల్గొంటాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. గ్రూపు ఏలో ఇండియా ‘ఏ’, పాక్ ‘ఏ’, నేపాల్, యూఏఈ‌ జట్లను చేర్చారు. భారత జట్టు ఫిబ్రవరి 13న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది.తర్వాత 15న పాక్‌తో, 17న నేపాల్‌తో తలపడనుంది. టీ20 వరల్డ్ కప్‌లో కొలంబో వేదికగా భారత్, పాక్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుండగా.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో ‘ఏ’ జట్ల మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. దీంతో అభిమానులు ఒకే రోజు రెండు భారత్, పాక్ మ్యాచ్‌లను వీక్షించొచ్చు.


Next Story