- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025 FINAL: బెంగుళూరు, పంజాబ్ ఫైనల్స్ మరో రికార్డు.. ఇదే తొలిసారి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ( IPL 2025 Final) మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ( IPL 2025 Final) మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) మధ్య జరిగిన సంగతి తెలిసిందే. జూన్ మూడో తేదీన జరిగిన ఈ మ్యాచ్ లో విజయం సాధించి తొలిసారిగా చాంపియన్స్ అయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB). అయితే బెంగళూరు వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్ ను... టీవీలలో 169 మిలియన్ల మంది వీక్షించినట్లు తాజాగా బార్క్ ( Barc) ప్రకటన చేసింది. 2021 t20 వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Ind VS PAK) మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీవీలలో 166 మిలియన్ల మంది ఆ మ్యాచ్ చూశారు. అయితే ఆ రికార్డును తాజాగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ బ్రేక్ చేసింది.
వీక్ డే లో టీవీ రేటింగ్ 11గా నమోదు కావడం ఇదే మొదటిసారి అని కూడా వెల్లడించింది బార్క్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ హిస్టరీలో ఇది మూడో అత్యధికం కావడం గమనార్హం. అంతేకాదు మొత్తం వాచ్ టైం 15 మిలియన్ మినిట్స్ నమోదు కావడం విశేషం. 2024 t20 వరల్డ్ కప్ ఫైనల్ లో 14.2 మిలియన్ మినిట్స్ రికార్డు కావడం చూసాం. ఆ రికార్డును కూడా ఇప్పుడు ఈ మ్యాచ్ బ్రేక్ చేసింది.
🚨 HISTORY IN IPL 2025 FINAL 🚨
— Johns. (@CricCrazyJohns) June 14, 2025
- 169 Million viewers watched the RCB vs PBKS IPL 2025 Final on TV in India, This is new record in India on Television. [BARC Data] pic.twitter.com/ZNdwICqkyb






