- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RR vs MI: 14 ఏళ్ల సెంచరీ వీరుడు వైభవ్ డకౌట్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సెంచరీ వీరుడు వైభవ్ సూర్య వంశీ... అందరినీ నిరాశపరిచాడు. మొన్న గుజరాతి టైటాన్స్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సెంచరీ వీరుడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi )... అందరినీ నిరాశపరిచాడు. మొన్న గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన సెంచరీ తో దుమ్ము లేపిన వైభవ్ సూర్యవంశీ.... ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మ్యాచ్ లో మాత్రం తోక ముడిచాడు. కేవలం రెండు బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ డకౌట్ అయ్యాడు. దీపక్ చాహర్ ( Deepak Chahar) బౌలింగ్ లో నేరుగా విల్ జాక్స్ కు ( Will jacks )క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. దీంతో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు.
14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ డకౌట్ కాగా.... మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా 13 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండు సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్... ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్... రెండు ఓవర్లు ఆడి 22 పరుగులు చేసే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాలంటే మరో 196 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్... భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ముంబై ఇండియన్స్ ఏకంగా 217 పరుగులు చేసింది.






