Viabhav Suryavanshi : గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

by Muthe.Rajitha |   (  Updated:2025-04-28 17:18:04  IST  )

ఐపీఎల్(IPL) లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Viabhav Suryavanshi) సంచలనం సృష్టించాడు.

Viabhav Suryavanshi : గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL) లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Viabhav Suryavanshi) సంచలనం సృష్టించాడు. 35 బాల్స్ లో సెంచరీ కొట్టి, ఔరా అనిపించాడు. ఐపీఎల్ 18వ సీజన్లో నేడు గుజరాత్, రాజస్తాన్(RR vs GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ లక్ష్యాని రాజస్తాన్ ముందు ఉంచింది. కొండంత టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ బ్యాటర్స్ మాత్రం గ్రౌండ్లోకి దిగగానే చెలరేగిపోయారు. ముఖ్యంగా ఐపీఎల్ లోనే అత్యంత చిన్న వయస్కుడు అయిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సులు బాదుతూ బౌలర్స్ ను ఉతికి ఆరేశాడు.

కేవలం 35 బాల్స్ లోనే సెంచరీ నమోదు చేశాడు ఈ చిచ్చర పిడుగు. 7 ఫోర్లు, 11 సిక్సులతో చెలరేగిపోయాడు. యశస్వి జైస్వాల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని పరుగుల సునామీ సృష్టించారు ఇద్దరు. ఈ దెబ్బతో వరుస ఓటములతో విలవిలలాడుతున్న రాజస్తాన్ రాయల్స్ కు భారీ విజయం సొంతం చేసుకోబోతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Next Story