గంగూలీ రికార్డును బ్రేక్ చేసిన 10వ తరగతి స్టూడెంట్

by Harish |

రంజీ ట్రోఫీలో భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న ఓ రికార్డు బ్రేక్ అయ్యింది.

గంగూలీ రికార్డును బ్రేక్ చేసిన 10వ తరగతి స్టూడెంట్
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న ఓ రికార్డు బ్రేక్ అయ్యింది. దాదా రికార్డును అధిగమించింది 10వ తరగతి స్టూడెంట్ కావడం విశేషం. ఆ కుర్రాడే 15 ఏళ్ల అంకిత్ ఛటర్జీ. బెంగాల్ తరపున అతి చిన్న వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనత గంగూలీ పేరిట ఉండేది. 1989-90 రంజీ ట్రోఫీలో దాదా 17 ఏళ్ల వయసులో ఢిల్లీపై బెంగాల్‌కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా హర్యానాతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌‌‌లో 15 ఏళ్ల అంకిత్ బెంగాల్ తరపున అరంగేట్రం చేయడంతో దాదా రికార్డు బద్దలైంది. 35 ఏళ్ల తర్వాత అంకిత్ ఈ రికార్డు అధిగమించడం గమనార్హం. అంకిత్ ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. 15 ఏళ్ల వయసులో అద్భుతంగా రాణించడంతో బెంగాల్ రంజీ జట్టులో చోటు దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ గాయపడటంతో అంకిత్ హర్యానాతో మ్యాచ్‌లో రంజీల్లో అరంగేట్రం చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, మొత్తంగా రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన యంగెస్ట్ ప్లేయర్ రికార్డు బిహార్‌కు చెంది 12 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరిట ఉంది.


Next Story