- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఆదాయంలో 10 శాతం వారికే.. స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం
టీమిండియన్ స్టార్ క్రికెటర్ (Team Indian star cricketer) రిషబ్ పంత్ (Rishabh Pant) తన మంచి మనసు (good heart)ను చాటుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియన్ స్టార్ క్రికెటర్ (Team Indian star cricketer) రిషబ్ పంత్ (Rishabh Pant) తన మంచి మనసు (good heart)ను చాటుకున్నారు. తనకు కమర్షియల్ యాడ్స్ (commercial ads) ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతాన్ని పేదలకు సాయం చేసేందుకు ఫౌండేషన్ (foundation) కు అందజేయనున్నారు. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా ప్రకటన చేశారు. ఈ సాయాన్ని రిషబ్ పంత్ ఫౌండేషన్ (Rishabh Pant Foundation) ద్వారా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడు తన జీవితం పట్ల చాలా దయ చూపాడని, దేశం కోసం క్రికెట్ ఆడే నా కలని, జీవించే అవకాశాన్ని ఇచ్చి తనను ఆశీర్వదించాడని అన్నాడు.
అలాగే ఈ మార్గంలో నాకు లభించిన ప్రేమ, మద్దతు, ప్రోత్సాహానికి తాను చాలా కృతజ్ఞతతో ఉన్నానని తెలిపాడు. క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని, కఠిన సమాయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నానని అన్నాడు. మన జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు తనకు జీవిత పాఠాలను నేర్పాయని, కొన్ని సంవత్సరాల క్రితం తాను అటువంటి పరిస్థితులకు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. అందుకే ఇంకా ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తనకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా.. కమర్షియల్ యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయంలో 10 శాతం ఆర్పీఎఫ్ (RPF)కు విరాళంగా ఇచ్చి, పేదల జీవితాల్లో కొంత చిరునవ్వును నింపాలనుకుంటున్నానని అన్నాడు.
తిరిగి ఇవ్వడంలో వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిదని, ఆర్ పీఎఫ్ తనకు చాలా ప్రియమైన ప్రాజెక్ట్ అని, దాని లక్ష్యాలు తనకు దగ్గరగా ఉన్నాయిని అన్నాడు. దీనిపై మరో రెండు నెలల్లో అన్ని విషయాలు వెల్లడిస్తానని, మీ ప్రేమ, ఆశీస్సులు, మద్దతుకు ధన్యవాదాలు అని పంత్ చెప్పుకొచ్చారు. పంత్ నిర్ణయం పట్ల తన అభిమానులు, క్రికెట్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని, తనకు కలిగిన అనుభవాల నుంచి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. అంతేగాక పంత్ నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్నారు. ఇక ఇండియన్ క్రికెట్ లో మూడు ఫార్మాట్ లలో కీలక ఆటగాడిగా ఉన్న పంత్.. దాదాపు 10 ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నాడని తెలుస్తోంది. అటు ఐపీఎల్(IPL) లోనూ అత్యదిక ధరకు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించాడు.






