పంత్ అరుదైన ఘనత..148 ఏళ్లలో రెండో వికెట్ కీపర్‌గా రికార్డు!

by Phanindra |   (  Updated:2025-06-23 19:44:36  IST  )

హెడింగ్లే టెస్టు రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు బాదాడు రిషభ్ పంత్. ఈ క్రమంలో 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.

పంత్ అరుదైన ఘనత..148 ఏళ్లలో రెండో వికెట్ కీపర్‌గా రికార్డు!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో 118 పరుగులతో రాణించిన అతను.. ఒక టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు బాదిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు.

ఈ లిస్టులో తొలి స్థానంలో జింబాబ్వే లెజెండ్ ఆండీ ఫ్లవర్ ఉన్నాడు. అలాగే ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఏడో భారత ప్లేయర్ పంత్. విదేశీ గడ్డపై జరిగిన టెస్టులో ఇలా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు బాదిన చివరి ప్లేయర్ విరాట్ కోహ్లీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా పంత్ కెరీర్‌లో ఇది 8వ టెస్టు సెంచరీ.

Next Story