మేడారం బంగారం కథ

by Bhoopathi Nagaiah |

గిరిజన సంస్కృతిలోనూ మేడారం జాతరలోనూ బెల్లాన్ని బంగారంగా భావించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గిరిజనులకు ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన బెల్లం అత్యంత శక్తినిచ్చే ఆహారం.

మేడారం బంగారం కథ
X

గిరిజన సంస్కృతిలోనూ మేడారం జాతరలోనూ బెల్లాన్ని బంగారంగా భావించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గిరిజనులకు ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన బెల్లం అత్యంత శక్తినిచ్చే ఆహారం. పూర్వకాలంలో అటవీ ప్రాంతాల్లో బంగారం కంటే ప్రాణాన్ని నిలిపే ఆహారానికే విలువ ఎక్కువ. యుద్ధ సమయంలో గాయపడిన వీరులకు, అలసిపోయిన సైనికులకు బెల్లం తక్షణ శక్తిని ఇచ్చేది. సమ్మక్క కూడా తన ప్రజలకు బెల్లం పంచి శక్తిని నింపేదని కథనం. బంగారానికి ఎంత విలువ ఉంటుందో, భక్తులు అమ్మవారికి ఇచ్చే బెల్లానికి అంత విలువ ఉంటుందని వారి నమ్మకం. తమ బరువుకు సమానంగా బెల్లాన్ని (తులభారం) సమర్పించడం ద్వారా, తమ సర్వస్వాన్ని అమ్మవారికి అప్పగిస్తున్నామని భావిస్తారు. అందుకే దీనిని ‘నిలువు దోపిడీ’ అని కూడా అంటారు.

అందుకే బంగారం ఇస్తారా?

కొంతమంది గిరిజనుల వాదన ప్రకారం.. ప్రతాపరుద్రుడు తమ తల్లి సమ్మక్కపై యుద్ధానికి వచ్చింది కప్పం చెల్లించనందుకే కదా.. అందుకే తమలో చాలామంది ఒకప్పుడు నిజమైన బంగారం, వెండి కానుకలే అమ్మవారికి సమర్పించేవారని చెప్తారు. దీంతోపాటు యుద్ధంలో గాయపడిన సమ్మక్క త్వరగా కోలుకోవాలని బెల్లం కూడా కానుకగా ఇచ్చేవారు. అయితే, కాలక్రమేణా బెల్లమే బంగారంగా పిలవడం మొదలైందని గిరిజనులు అంటారు.

Next Story