- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Terrorist Attack: భారత్ అమ్ముల పొదిలోని తిరుగులేని క్షిపణులు ఇవే.. పాక్ వెన్నులో వణుకు
Pahalgam Terrorist Attack: భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: Pahalgam Terrorist Attack: భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దళాధిపతులతో భేటీ అయి వారికి నిర్ణయం తీసుకునేందుకు స్వేచ్ఛను అందించారు. ఈ నేపథ్యంలో యుద్ధమేఘాలు రావడం తథ్యం అని త్వరలోనే పాకిస్తాన్ పైన భారత్ పహల్గాం దుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకుంటుందని రక్షణ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కనుక వచ్చినట్లయితే ఇరుదేశాల శక్తిసామర్థ్యాలను పోల్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్షిపణుల విషయంలో ఎవరిది పై చేయి ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్ అమ్ముల పొదిలో బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ ప్రధానంగా ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ వద్ద కూడా షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల వద్ద ఏ రకం మిసైల్స్ ఉన్నాయి… వాటి రేంజ్ ఎంత…? వాటి పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..?
భారత్ అమ్ముల పొదిలో క్షిపణులు ఇవే:
అగ్ని-5:
ఇది ఒక ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ICBM), ఇది భారతదేశం అభివృద్ధి చేసినది. దీని రేంజ్ సుమారు 5,000 నుండి 5,500 కిలోమీటర్లు. దీని పరిధిలోకి పాకిస్తాన్ మొత్తం వస్తుంది. అలాగే చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్ – 4,200 కిమీ, షాంఘై, సుమారు 4,600 కిమీ, చెంగ్డు –3,000 కిమీ, గ్వాంగ్‌జౌ -4,200 కిమీ, హార్బిన్ - 4,800 కిమీ, షెన్‌జెన్- 4,100 కిమీ కూడా ఈ క్షిపణి రేంజ్ లోకి వస్తాయి.
అగ్ని-4:
భారత్ అభివృద్ధి చేసిన ఒక మధ్య-శ్రేణి బాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ సుమారు 3,500 నుంచి 4,000 కిలోమీటర్లు. ఈ క్షిపణి సుమారు 1,000 కిలోగ్రాముల వార్ హెడ్ సామర్థ్యం కలిగి ఉంది.
అగ్ని-3:
ఇది ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ (IRBM) ఈ మిసైల్ ను DRDO అభివృద్ధి చేసింది. అది అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ సుమారు 3,000 – 3,500 కిలోమీటర్లు. భారత్ నుంచి పాకిస్థాన్ లోని అన్ని నగరాలతో పాటు, చైనా దక్షిణ, మధ్య ప్రాంతాల్లోని నగరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇది పాకిస్తాన్ కంటే చైనాపై దృష్టి పెట్టిన మిసైల్ అని నిపుణులు చెబుతుంటారు.
పృథ్వీ-2:
ఇది DRDO అభివృద్ధి చేసిన మొదటి తరం బాలిస్టిక్ మిసైళ్లలో ఒకటి. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ (SRBM). ఇది సుమారు 250 నుండి 350 కిలోమీటర్ల రేంజులో దాడులు చేయగలదు. సరిహద్దులకు సమీపం ఉన్న లక్ష్యాలపై ఇది దాడి చేయగలదు
బ్రహ్మోస్ (క్రూయిజ్ మిసైల్): దీని రేంజ్ 450-500 కిమీ
నర్భయ (క్రూయిజ్ మిసైల్):
ఒక సబ్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ (subsonic cruise missile). ఇది బ్రహ్మోస్ కన్నా తక్కువ వేగం గలిగిన మిసైల్ దీని రేంజ్ 1,000 కిమీ. ఇది రాడార్‌కి కనిపించకుండా దాడి చేస్తుంది. ఇది లక్ష్యాన్ని టిక్ చేసుకొని కొట్టే ఖచ్చితత్వం ఉంది.
పాకిస్తాన్ వద్ద ఉన్న క్షిపణులు ఇవే..
- షహీన్-3: పరిధి 2,750 కిమీ
- షహీన్-2: పరిధి 2,000 కిమీ
- ఘోరీ (Ghauri): పరిధి 1,500 కిమీ
- నస్ర్ (Nasr) టాక్టికల్: పరిధి 70-100 కిమీ
- బాబర్ (Babur) క్రూయిజ్ మిసైల్: పరిధి 700 కిమీ






