Safest Havens: అప్పు చేసి అయినా ఈ దేశాలకు వెళ్లిపోతే బాగుండు భయ్యా.. మూడో ప్రపంచ యుద్ధమొచ్చినా ఏమీ కాదు!

by Vennela |

Safest Havens: ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే భయాందోళనలు నెలకున్నాయి.

Safest Havens: అప్పు చేసి అయినా ఈ దేశాలకు వెళ్లిపోతే బాగుండు భయ్యా.. మూడో ప్రపంచ యుద్ధమొచ్చినా ఏమీ కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: Safest Havens: ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే భయాందోళనలు నెలకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో అనే ఆందోళన మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ భూమ్మీదా ఏఏ దేశాలు సురక్షితంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ జాబితాలో భారత్ ఉందా?

ప్రపంచవ్యాప్తంగా నెలకున్న పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల్లో యుద్ధం.. పలు దేశాల్లో సరిహద్దు వివాదాలు.. ఇవన్నీ కూడా యుద్ధ వాతావారణాన్ని తలపిస్తున్నాయి. దీంతో చాలా మంది మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్న భయంలో ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళనను రేకెత్తిస్తోంది.

ప్రపంచంలో అనేక దేశాల్లో మూడో ప్రపంచ చుద్ధం గురించి భయాందోళన మొదలైంది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్లయితే ప్రపంచంలో ఏయే దేశాలు సురక్షితంగా ఉంటాయనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా. యుద్ధంలో వేసే అణుబాంబుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలో కొరత కూడా ఏర్పడుతుంది. రేడియేషన్ ద్వారా భారీ విధ్వంసమే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎదురైన కొన్ని దేశాలు..ప్రదేశాలు మాత్రం పెద్దగా ప్రభావం చూపదు.

న్యూజిలాండ్, ఐర్లాండ్

దక్షిణ అమెరికాలోని చిలీ, ఉరుగ్వే, అర్ంటీనా వంటి దేశాలకు మూడో ప్రపంచ యుద్ధంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ దేశాలు ప్రధాన ఆహార ఎగుమతులు కాబట్టి యుద్ధం వల్ల ఇక్కడ ఆహార కొరత ఉండదు. అంతేకాదు ఫిజీ దీవులు, ఐస్ లాండ్, గ్రీన్ లాండ్, న్యూజిలాండ్, భూటాన్, ఐర్లాండ్ దేశాలు కూడా ప్రపంచంలో సురక్షితమైన ప్రాంతాలు.

స్విట్జర్లాండ్, సింగపూర్

ప్రపంచంలో సురక్షితమైన దేశాలుగా పేరుపొందనవి స్విట్జర్లాండ్, సింగపూర్. ఈదేశాల్లో ఉండే విస్తారమైన పర్వతప్రాంతాలు అణు ఆయుధ దాడి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

అర్కిటిక్, అంటార్కిటికా ఖండాలు

ప్రపంచంలోనే ఆర్కిటిక్, అంటార్కిటికా ఖండాలు అత్యంత తక్కువ జనాభా కలిగి ప్రాంతాలు. ఇవి పెద్ద భూభాగాన్ని కలిగి ఉన్నాయి. ఈ కారణంగా అణు దాడి నుంచి తప్పించుకన్న వేలాది మందికి ఇవి ఆశ్రయం ఇస్తాయి. ఆర్కిటిక్ అంటార్కిటికా కూడా పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశాలు హిందూ మహాసముద్ర ద్వీపదేశాలు.

ఆంగ్లేసీ ద్వీపం

ఆంగ్లేసీ అనేది వాయువ్య వేల్స్ తీరంలో ఉన్న ఒక ద్వీపం. ఇది మెనాయ్ జలసంధి ద్వారా ప్రధాన భూభాగం నుంచి సెపరేట్ అయ్యింది. ఈ ద్వీపం అందమైన బీచ్ లు, విస్తారమైన భూభాగాన్ని కలిగి ఉంది. ఆంగ్లేసీ చాలా తక్కువ జనాభాను కలిగి ఉంటుంది.

భారత్ సురక్షితమేనా?

భారత్ ఎప్పుడు శాంతి కొరుకునే దేశం. మన దేశం ఎజెండా కూడా ఇదే. అయితే భారత్ పై దాడి చేసేందుకు ఎవరొచ్చినా ధైర్యంగా ఎదుర్కునే అణ్వాయుధాల శక్తిని కలిగి ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో టాప్. టెక్నాలజీలోనూ దూసుకుపోతోంది. ఇతర దేశాలతోమంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన భారత్ కు ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పవచ్చు.

Next Story