మిస్టరీగా మారిన మిస్సైన అణుబాంబు? ఎప్పుడు పేలుతుందో తెలుసా?

by Muthe.Rajitha |   (  Updated:2025-08-25 14:33:20  IST  )

రెండో ప్రపంచ యుద్ధం చివరలో అమెరికా జపాన్ పై వేసిన అణుబాంబు చేసిన విధ్వంసం హిరోషిమా, నాగసాకి పట్టణాలు నామ రూపాల్లేకుండా పోయాయి.

మిస్టరీగా మారిన మిస్సైన అణుబాంబు? ఎప్పుడు పేలుతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : రెండో ప్రపంచ యుద్ధం చివరలో అమెరికా జపాన్ పై వేసిన అణుబాంబు చేసిన విధ్వంసం హిరోషిమా, నాగసాకి పట్టణాలు నామ రూపాల్లేకుండా పోయాయి. ఆ దాడిలో దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా క్షణాల్లో బూడిదయ్యారు. మరో లక్షమంది వరకు ఆసుపత్రుల పాలయ్యారు. ప్రపంచం అంతా వణికిపోయిన ఈ సంఘటన అనంతరం అణు ఆయుధాల వాడకం నిషేధంపై ప్రపంచదేశాలు సంతకాలు చేసాయి. ఇప్పటికీ ఆ దుర్ఘటన రోజున జపాన్ లో తమ వాళ్ళను తలుచుకొని కన్నీరు కారుస్తుంటారు. అయితే సాధారణ అణుబాంబుకే అంతటి విధ్వంసం జరిగితే అంతకు 70 రెట్ల శక్తివంతం అయిన థర్మోన్యూక్లియర్ బాంబు చేసే వినాశనం కనీసం మనిషి ఊహించలేడు కూడా.

అయితే అంత శక్తివంతం అయిన థర్మో న్యూక్లియర్ బాంబు మిస్సయిందని మీకు తెలుసా? నిన్నా మొన్న కాదు దాదాపు 60 ఏళ్ల కిందనే ఆ బాంబు మిస్సై ఇంకా దాని ఆచూకి కూడా దొరకలేదంటే నమ్ముతారా? కానీ అది నిజం. అది గనుక విస్ఫోటనం చెందితే సగం సగం ప్రపంచం మ్యాప్ నుంచి కనబడకుండా పోతుందట. మరి అలాంటి న్యూక్లియర్ బాంబు ఎలా మిస్సయింది. ఇప్పుడు ఎక్కడుంది? అది ఎప్పుడు పేలుతుంది? అనే విషయాలు చూద్దాం.

ఎలా మిస్సయింది?

1965, డిసెంబర్ 5న ఫిలిప్పీన్ సముద్రంలో జపాన్ కు చెందిన రుక్యూ దీవులకు కేవలం 80 మైళ్ళ దూరంలో ఈ ఘటన జరిగింది. A-4E స్కైహాక్ అనే నావికాదళ విమానం నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఫ్లయిట్ డెక్ కు తరలిస్తున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్ బ్రేకులు వేయకపోవడంతో.. అది ఒక్కసారిగా జారి సముద్రంలో పడిపోయింది. B43 థర్మోన్యూక్లియర్ బాంబుతో సహా పైలట్ కూడా సముద్రంలో విమానంతో సహా మునిగిపోయారు. వెంటనే నావికాదళ సిబ్బంది గాలింపులు చేపట్టినప్పటికీ పైలట్ ధరించిన టోపీ తప్ప ఏదీ లభించలేదు. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం, సముద్రంలో 16,200 అడుగుల (4,900 మీటర్లు) అత్యంత అడుగుకు చేరినట్టు భావించి ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాని జాడ తెలియలేదు. ఈ ఘటనను మిలిటరీ భాషలో "(Broken Arrow)" అని పిలుస్తారు.

అయితే అది కేవలం జపాన్ దీవులకు 80 మైళ్ళ దూరంలోనే జరిగినా.. అమెరికా మాత్రం 500 మైళ్ళ దూరంలో జరిగిందని అబద్దం చెప్పి తప్పించుకుంది. అయితే అమెరికా దాచిన ఈ నిజం 1989 దాకా అంటే దాదాపు 25 ఏళ్ల దాకా బయటికి రాలేదు. ఈ వార్త బయటికి వచ్చాక జపాన్ అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఇదొక్కటే కాదు రెండో ప్రపంచ యుద్ధం చివరలో అమెరికా- సోవియట్ రష్యా యూనియన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న కాలంలో ఇలాంటి బ్రోకెన్ ఆరో ఘటనలు 30 వరకు జరిగాయి. వాటిలో 1958లో జార్జియా సమీపంలో ఒక మార్క్ బాంబు, 1968లో గ్రీన్లాండ్ సమీపంలో 4 హైడ్రోజెన్ బాంబులు, 6 అణు బాంబులు మిస్సింగ్ ఘటనలు ముఖ్యమైనవి. వాటిలో ఈ జపాన్ ఘటన కూడా అత్యంత కీలకమైనది.

ఎప్పుడు పేలుతుంది?

బాంబు ఫిలిప్పీన్ సముద్రం లోతుల్లోనే ఉంది. కానీ అది ఇంతలోతులో ఉందో ఇప్పటివరకు అటు అమెరికా గాని, ఇటు ఫిలిప్పీన్, జపాన్ గాని తేల్చలేక పోయాయి. ఇకపై కూడా దానిని కనుక్కోవడం దాదాపు అసాధ్యం అంటున్నారు నిపుణులు. అయితే బాంబు పేలాలి అంటే నిర్దిష్టమైన పరిస్థితులు అవసరం గనుక, అది ఇకపై కూడా పేలే అవకాశం లేనట్టే. సముద్రాన్ని చేరి దశాబ్దాలలు గడుస్తుండగా.. తుప్పు కారణంగా బాంబు పనిచేయకపోవచ్చు. అయినప్పటికీ, అందులోని యురేనియం, ప్లూటోనియం వంటి రేడియోధార్మిక పదార్థాలు పర్యావరణంపై దీర్ఘకాల ప్రభావం కలిగించే అవకాశం ఉంది అంటున్నారు. మరి భవిష్యత్తులో ఇంకా అత్యాధునిక సాంకేతికత సాధించి, సముద్రంలో మిస్సయిన అన్ని బాంబులను కనుక్కొని, వాటిని జాగ్రత్తగా నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story