- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LRS : ఎల్ఆర్ఎస్ ఆదాయంపై ఆశలు గల్లంతు.. ఎంతొస్తే అంతే ఇక !
LRS : ఎల్ఆర్ఎస్ ఆదాయంపై ఆశలు గల్లంతు.. ఎంతొస్తే అంతే ఇక !

దిశ, తెలంగాణ బ్యూరో : లే అవుట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ఆశించిన స్థాయిలో స్పందనలేదు. కానీ ప్రభుత్వం మాత్రం రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. అయినా సరే ‘ఎంతొస్తే..అంతే.. 25శాతం రాయితీ గడువు ఇద్దాం’ అంటూ ఆదాయం కోసం ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. అందులో భాగంగా ఎల్ఆర్ఎస్ కు ఆశించిన స్థాయిలో స్పందనలేకపోయినా.. ప్రభుత్వం గడువు పెంచుకుంటూ పోతూనే ఉంది. మరోసారి ఈనెలాఖరుకు 25శాతం రాయితీతో ఫీజు చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
2 లక్షల ప్రొసీడింగ్స్..
రాష్ట్ర వ్యాప్తంగా 26.15 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. 6.04 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 20.11 లక్షల దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. ఇప్పటి వరకు 6.26లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. వీటిలో సుమారు 2లక్షల మందికి అధికారులు ప్రొసీడింగ్స్ జారీచేశారు. అయితే ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి దరఖాస్తులను వెరిఫై చేస్తున్నారు. ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులు పరిశీలించిన తర్వాతనే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
రూ.2 వేల కోట్లు..
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకు రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వకముందు (20 ఫిబ్రవరి 2025) రూ.114.73కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం ఫిబ్రవరి 20 నుంచి 25శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి నెలలో రూ.1.18కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. మార్చిలో రూ.1,402.02కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ లో రూ.353.17 కోట్లు, మేలో రూ.119.84 కోట్లు, జూన్ 15 వరకు రూ.9.81 కోట్లు మాత్రమే వచ్చింది. అయినా ఫర్వాలేదని ప్రభుత్వం ఈ నెలాఖరుకు 25 శాతం రాయితీ గడువును పొడిగించింది. 25శాతం రాయితీ కల్పించిన తర్వాత నెలవారీగా ఆదాయం పరిశీలిస్తే ఇలా ఉంది
నెల - ఎల్ఆర్ఎస్ ఫీజు (రూ.కోట్లల్లో) - రాయితీ(రూ.కోట్లల్లో)
ఫిబ్రవరిలో ఎల్ఆర్ఎస్ ఫీజు రూ. 1.18 కోట్లు, రాయితీ రూ. 0.06 కోట్లు
మార్చిలో ఎల్ఆర్ఎస్ ఫీజు రూ. 1,402.02 , రాయితీ రూ. 482 కోట్లు
ఏప్రిల్‌లో ఎల్ఆర్ఎస్ ఫీజు రూ. 353.17, రాయితీ రూ. 121.62 కోట్లు
మేలో ఎల్ఆర్ఎస్ ఫీజు రూ. 119.84 రాయితీ రూ. 40.99 కోట్లు
జూన్ 15 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు రూ. 9.81, రాయితీ రూ. 3.65 కోట్లు
మొత్తం ఎల్ఆర్ఎస్ ఫీజు రూ. 2000.75 , రాయితీ రూ. 648.43 కోట్లు






