- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Real Boom : రాష్ట్ర రాజధానిలో రియల్ బూమ్.. గజం ధర రూ.3 లక్షలు..! రియల్ ఎస్టేట్ రూమర్స్‌కు చెక్
Real Boom : రాష్ట్ర రాజధానిలో రియల్ బూమ్.. గజం ధర రూ.3 లక్షలు..! రియల్ ఎస్టేట్ రూమర్స్‌కు చెక్

దిశ, కూకట్పల్లి : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గడంలేదు. ఖాళీ జాగలకు కోట్లలలో ధరలు పలుకుతున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన హౌసింగ్ బోర్డు స్థలాల వేలం పాటలో ఒక ప్లాట్ ఏకంగా గజం రూ. 2.98 లక్షలు వేలం పాటలో ఒకరు సొంతం చేసుకోవడంతో సర్వత్రా చర్చ ప్రారంభం అయింది. గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్‌కు బ్రేక్ పడిందని జరుగుతున్న చర్చకు హౌసింగ్ బోర్డు వేలంలో పలికిన ధరలు చూస్తుంటే రియల్ ఎస్టేట్‌కు రెక్కలు వచ్చినట్టేనని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధుల సమీకరణలో భాగంగా రాష్ట్రంలోని రాజీవ్ గృహకల్ప, హౌసింగ్ బోర్డు శాఖల ఆధీనంలో ఉన్న భూములను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే హసింగ్ బోర్డు వెస్ట్రన్ విభాగం పరిధిలోని హౌసింగ్ బోర్డు ఆస్తుల వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల వేలంలో గరిష్ఠంగా కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని ప్లాట్ నంబర్ 22లోని 151.92 గజాల ప్లాట్ ధర గజానికి రూ. 2.98 లక్షల ప్రకారం మెత్తం 3,39,54,120 రూపాయలకు ప్లాట్ విక్రయించారు. అదే విధంగా కనిష్ఠంగా కైత్లాపూర్‌లోని 36.16 గజాల స్థలానికి గజానికి 1.14 లక్షల రూపాయల చొప్పున 30,91,680 రూపాయలకు స్థలాన్ని విక్రయించారు. హౌసింగ్ బోర్డు పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీ 7వ ఫేజ్, ఎంఐజీ, కైత్లాపూర్ పరిధిలోని మొత్తం 18 ఆస్తులకు సంబంధించి సుమారు 6,236 చదరపు గజాల ఖాళీ స్థలాలను వేలంలో విక్రయించగా ఏకంగా 142 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డుకు ఆదాయం వచ్చింది. వేలంలో మొత్తం 86 మంది పాల్గొన్నారు.
హౌసింగ్ బోర్డు పరిధిలోని ఆస్తుల ధరలు
ప్లాటు విస్తీర్ణం (గజాల్లో) ధర (గజానికి)
ఎంఐజీ 54 194.44 2.52 లక్షలు
ఎంఐజి 55 194.44 2.50 లక్షలు
ఎంఐజి 56 194.44 2.42 లక్షలు
ఎంఐజి 57 194.44 2.35 లక్షలు
ప్లాట్ నం.17 220.38 2.81 లక్షలు
ప్లాట్ నం.18 254.44 2.40 లక్షలు
ప్లాట్ నం.19 292 2.88 లక్షలు
ప్లాట్ నం.20 249.32 2.71 లక్షలు
ప్లాట్ నం.21 270.02 2.72 లక్షలు
ప్లాట్ నం.22 151.92 2.98 లక్షలు
ప్లాట్ నం.23 266.84 2.42 లక్షలు
ప్లాట్ నం.24 921.13 1.90 లక్షలు
ప్లాట్ నం.25 789.27 1.70 లక్షలు
ప్లాట్ నం.26 978.92 1.80 లక్షలు
ప్లాట్ నం.27 484.6 2.17 లక్షలు
ప్లాట్ నం.28 389.39 1.84 లక్షలు
ప్లాట్ నం.29 446 2. 2.22 లక్షలు
కైత్లాపూర్.౩౦ 36.16 1.14 లక్షలు






