ఈ- వేస్ట్.. రీసైకిలే బెస్ట్.!

by Daayi Srishailam |

ఆ పారేసేదేదో సరైన రీతిలో పారేసి రీసైక్లింగ్ ఎలా చేయొచ్చో చూద్దామా.?

ఈ- వేస్ట్.. రీసైకిలే బెస్ట్.!
X

ఫోన్ పాతదైపోయిందని కొత్తది కొంటాం.

ఆర్నెళ్లవగానే దాన్నీ పడేస్తాం.

సేమ్ ల్యాప్ టాప్ కూడా అలానే చేస్తాం.

ఇలా వాడేసిన.. మార్చేసిన గ్యాడ్జెట్స్ పారేస్తూ పోతే చివరకు ఏమవుతుంది.?

ఈ- వ్యర్థంగా పర్యావరణాన్ని పాడుచేస్తుంది.

ఆ పారేసేదేదో సరైన రీతిలో పారేసి రీసైక్లింగ్ ఎలా చేయొచ్చో చూద్దామా.?

- దాయి శ్రీశైలం


ఇండియాలో ప్రతీ సంవత్సరం 1.6 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఈ- వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిలో కొంతవరకు మాత్రమే ఆథరైజ్డ్ చానెల్స్ ద్వారా రీసైకిల్ అవుతాయి. మరి మిగిలినవి.?

సమర్థవంతమైన గైడ్..

ఆథరైజ్డ్ చానెల్స్ ద్వారా రీసైకిల్ చేయగా మిగిలినవి ల్యాండ్‌ఫిల్‌లో లేదా అనధికార స్ర్కాప్ వర్కర్ల చేతిలోకి వెళ్తాయి. దీనివల్ల నీరు.. ఇంకా మానవ ఆరోగ్యం విషపూరితం అవుతుంది. మీ ఫోన్ పనిచేయడం ఆగిపోతే.. టీవీ ఆగిపోతే లేదా చార్జర్ల డ్రాయర్స్ నిండిపోతే ఏం చేయాలి.? భూమిని.. భూమిపై జీవిస్తున్న జీవరాశికి హాని చేయకుండా బాధ్యతాయుతంగా ఈ- వ్యర్థాలను సరళమైన.. సమర్థవంతమైన గైడ్‌ను అనుసరించాలి.

అసలేంటి ఈ- వ్యర్థం.?

ఈ- వ్యర్థం అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అన్నమాట. మనం ఉపయోగించని బ్యాటరీ.. ప్లగ్.. సర్య్కూట్ బోర్డ్ లాంటిది ఏవైనా ఈ- వ్యర్థాల కిందికే వస్తాయి.

- మొబైల్ ఫోన్స్.. ల్యాప్‌‌‌‌‌‌టాప్స్.. టాబ్లెట్స్.. ప్రింటర్స్.

- ఫ్రిజ్.. ఏసీలు.. వాషింగ్ మెషిన్స్.. మైక్రోవేవ్.

- కేబుల్స్.. చార్జర్స్.. ఇయర్‌ఫోన్స్.. రిమోట్ కంట్రోల్స్.

డస్ట్‌బిన్‌లో ఎందుకు వేయొద్దు.?

ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాధారణ డబ్బాల్లో వేయడం వల్ల అవి తరుచూ డంపింగ్ గ్రౌండ్లోకి చేరతాయి. సీసం.. మెర్క్యురీ.. కాడ్మియం వంటి విషపూరిత పదార్థాలను నేల.. భూ గర్భజల్లాలోకి విడుదల చేస్తాయి. అనధికార స్క్రాప్ వర్కర్లు.. పిల్లలు సహా ఈ వస్తువులను రక్షణ లేకుండా కాల్చడం.. విడగొట్టడం వల్ల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

మరి ఎలా.?

బ్రాండ్ టేక్ బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉపయోగించాలి. చాలా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు టేక్ బ్యాక్ లేదా రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తాయి. ఆపిల్ ఫోన్ యూజ్ చేసేవారు అనుకోండి. ఏదైనా ఆపిల్ స్టోర్‌లో డివైస్లను తిరిగి ఇవ్వండి. లేదా apple.com/in/recycling ద్వారా ఆన్‌లైన్లో ట్రేడ్ ఇన్ ప్రారంభించండి. సామ్‌సంగ్ ఫోన్ వాళ్లు samsung.com/in/recycling ద్వారా సమీపంలోని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ని కనుక్కోండి. డెల్ ఇంకా హెచ్‌పీ వారి ఇండియా సపోర్ట్ పేజీల ద్వారా ఈ- వ్యర్థ పికప్ అందిస్తాయి. ఫైనల్‌గా కొత్తవి కొనుగులో చేస్తున్నప్పుడు పాతవి తిరిగి తీసుకోగలరా అని అడగాలి.

ఆథరైజ్డ్ రీసైక్లర్లు

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) పోర్టల్‌ను ఉపయోగించి ఆథరైజ్డ్ రీసైక్లర్లను తెలుసుకోండి. అలాంటి కొన్న విశ్వసనీయ సంస్థలు

ఎకోరెకో (పాన్ ఇండియా)

వెబ్‌సైట్: www.ecoreco.com

సేవలు: బిన్ లు.. పికప్.. ఆఫ్ పాయింట్స్.. సురక్షిత డేటా డిస్ట్రక్షన్.

సంప్రదింపు: 1800-102-1020 కాల్ చేసి పికప్ బుక్ చేసుకోండి.

కరో సంభవ్ (పాన్ ఇండియా)

వెబ్‌సైట్: www.karosambhav.com

ఏం చేయాలి: కన్ష్యూమర్ విభాగంలో సమీపంలోని సేకరణ కేంద్రాలు కనుక్కోండి. స్కూల్స్.. రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్స్.. కంపెనీలతో అవగాహన కార్యక్రమాలు.. రీసైక్లింగ్ క్యాంపెయిన్లు నిర్వహిస్తారు.

అట్టెరో (పాన్ ఇండియా)

వెబ్‌సైట్: www.attero.in

సంప్రదింపు: 1800-102-9882కు కాల్ చేయండి. లేదా [email protected]కు మెయిల్ పంపండి.

సేవలు: ఈ- వ్యర్థ నిర్వహణ.. లిథియం- అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్, ITAD నిర్వహణ

డోర్ స్టెప్ పికప్ ఎలా..?

కొన్ని సంస్థలు ఈ- వ్యర్థాలను మీ ఇంటి నుంచే నేరుగా సేకరిస్తాయి.

రీసైకల్ (పాన్ ఇండియా)

వెబ్‌సైట్: recykal.com

యాప్: రీసైకల్ మార్కెట్‌ప్లేస్ (ఆండ్రాయిడ్/iOS)

సెల్ స్మార్ట్ (పాన్ ఇండియా)

వెబ్‌సైట్: www.selsmart.in

సంప్రదింపు: +91-9355541464

డివైస్‌లను దానం చేయండి

మీ పాత ల్యాప్‌టాప్ లేదా ఫోన్ ఇంకా లైఫ్ ఉన్నవే అయుండొచ్చు. వాటిని ఉత్తగనే పారేయకుండా దానం చేయండి. అగో మరి అదెట్లా అంటరా.? దానికీ మన దగ్గర కొన్ని సంస్థలు ఉన్నాయి.

- డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్: defindia.org

- గూంజ్: goonj.org

- సంభవ్ ఫౌండేషన్: sambhavfoundation.org

- ఫ్రీ సైకిల్, ఓఎల్ఎక్స్

డేటాను రక్షించండి

మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను పారేయడానికి ముందు..

- మీ డేటాను బ్యాకప్ చేసి.. వైప్ చేయండి.

- పూర్తి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.

- ఏవైనా సిమ్ కార్డులు లేదా ఎస్‌డీ కార్డులను తొలగించండి.

- DBAN (Darik’s Boot and Nuke) వంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ల్యాప్‌టాప్ హార్డ్‌డ్రైవ్‌లను సురక్షితంగా వైప్ చేయండి.

ప్రచారం చేయండి

ఈ- వ్యర్థాలను అనధికార స్ర్రాప్ డీలర్లకు విక్రయించడం సులభమే అయినప్పటికీ.. ఇది సాధారణంగా విషపూరిత వ్యర్థాలకు అసురక్షితంగా నిర్వహించడానికి దారితీస్తుంది. ఈ వస్తువులను కాల్చొచ్చు.. లేదా విడగొట్టొచ్చు. సరిగా డంప్ చేయకపోవచ్చు. మీ డివైస్ సురక్షితంగా విడగొట్టబడి.. రీసైకిల్ చేయబడి.. లేదా రీపర్పస్ చేయబడేలా ఆథరైజ్డ్ చానెల్స్‌కు కట్టుబడి ఉండండి. మీరు ఒక సొసైటీలో లేదా ఆఫీసులో ఉంటే.. త్రైమాసిక ఈ వ్యర్థాలను సేకరణ డ్రైవ్ గురించి ప్రచారం చేయండి. స్కూల్స్.. కాలేజీలో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి.

ఇది మన బాధ్యత

ఈ-వ్యర్థం కేవలం చెత్త కాదు. ఇది విలువైన లోహాలు.. పునర్వినియోగ పరచదగిన భాగాలు.. విషపూరిత రసాయనాల కాక్ టెయిల్. సరైనరీతిలో రీసైక్లింగ్ చేస్తే కాలుష్యం తగ్గుతుంది. విలువైన వనరులను తిరిగి పొందవచ్చు. హాని కలిగిన వర్కర్లను రక్షించవచ్చు. పాడైపోయిన ఫోన్‌ను మీరు పట్టుకున్నప్పుడు లేదా డెడ్ బ్యాటరీని విసిరేసినప్పుడు అది కేవలం మాయమైపోతుందని అనుకోకండి. అది ఎక్కడికో వెళ్లి పర్యావరణాన్ని పాడుచేస్తుంది. కాబట్టీ సురక్షితమైన.. సస్టెయినబుల్ పర్యావరణ కోసం బాధ్యతగా ఈ వ్యర్థాలను రీసైకిల్ చేద్దాం.

Next Story