- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్లెట్ గ్యారేజ్ క్వీన్.. దియా జోసెఫ్
కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన 22 ఏళ్ల దియా జోసెఫ్, భారతదేశంలో అత్యంత పిన్నవయసు రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్‌గా అవతరించింది.

దిశ, వెబ్ డెస్క్ : మహిళలు ఎక్కువగా స్కూటీలు నడుపుతారు. కొంతమంది మాత్రం ఎన్ఫీల్డ్, స్పోర్ట్స్ బైక్స్ కూడా అవలీలలుగా నడుపుతూ రోడ్లపై జామ్ అంటూ సాగిపోతుంటారు. అయితే ఇలా బైకులు నడపటం వరకు బానే ఉంటుంది గాని ఒక్క యువతికి గాని మహిళకు గాని బైక్ రిపేయిరింగ్ పనులు తెలియవు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఏమైందో తెలియక కంగారు పడుతుంటారు. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే యువతి చిన్నా చితకా బైకులు కాదు ఏకంగా బుల్లెట్ బైకులను ఒంటిచేత్తో రిపెయిర్ చేసి పెట్టగలదు. సాధారణంగా ఎన్ఫీల్డ్ బైకుల మెకానిక్ షాపులు పెద్ద పట్టణాల్లోనే.. అవి కూడా వేళ్ళ మీద లెక్కబెట్టే అన్ని మాత్రమే ఉంటాయి.
ఇక ఆ గ్యారేజ్ లో మగవాళ్లు మాత్రమే ఎంఫీల్డ్ లను రిపేయిర్ చేస్తూ, ఆపసోపాలు పడుతూ కనిపిస్తారు. అసలు మహిళలు బైక్ మెకానిక్ రంగంలో ఉండటమే అరుదు అయితే ఏకంగా ఎన్ఫీల్డ్ బైకుల మీదనే గురి పెట్టింది కేరళకు చెందిన దియా జోసెఫ్. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన 22 ఏళ్ల దియా జోసెఫ్, భారతదేశంలో అత్యంత పిన్నవయసు రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్‌గా అవతరించింది. మహిళలు అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టవచ్చునని దియా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దియా తండ్రి జోసెఫ్ డొమినిక్ బుల్లెట్ బైక్స్ గ్యారేజ్ నడుపుతుంటాడు. అప్పుడప్పుడు తండ్రికి గ్యారేజ్ లో చేదోడు వాదోడుగా ఉంటూ.. 19 ఏళ్ల వయసులోనే బుల్లెట్ రిపేర్ పై పట్టు సాధించింది. ఇపుడు ఇంజిన్ సర్వీసింగ్ నుండి రైడింగ్ వరకు నైపుణ్యం సాధించి, కొట్టాయంలోనే కాదు ఏకంగా దేశంలోనే గ్యారేజ్ క్వీన్ గా ఎదిగింది.
అమల్ జ్యోతి కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ, 98% మార్కులతో 12వ తరగతి పూర్తి చేసిన దియా.. తండ్రి బహుమతిగా ఇచ్చిన థండర్‌బర్డ్‌ను రైడ్ చేస్తూ ఎంతోమందికి రైడింగ్ లో మెళకువలు నేర్పిస్తుంది. ఒక్కో బుల్లెట్ బండి సర్వీసుకు రెండు నుంచి 5 వేళా రూపాయలు సంపాదిస్తూ, పురుషాధిపత్య రంగంలో స్టీరియోటైప్‌లను బద్దలు కొడుతోంది. అంతేకాదు 2024లో రాయల్ ఎన్ఫీల్డ్ గుర్తింపుతో చెన్నైలోని ఆర్ఎఫ్ ఫ్యాక్టరీలో పనిచేసే అవకాశం కొట్టేసింది. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా అని పాడుకోవడమే కాదు... బుల్లెట్ బైకుల సమస్యలను సరిచేస్తూ.. స్వేచ్ఛ, సంకల్పం, నైపుణ్యంతో ఎలాంటి కలలను అయినా సాకారం చేసుకోవవచ్చని దియా యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.






