బాలయ్య అంటేనే ఫుల్ ఎనర్జీ.. ప్రగ్యాజైస్వాల్ క్యూట్ కాంప్లిమెంట్

by  |
బాలయ్య అంటేనే ఫుల్ ఎనర్జీ.. ప్రగ్యాజైస్వాల్ క్యూట్ కాంప్లిమెంట్
X

దిశ, సినిమా: ‘సింహ, లెజెండ్’ తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషనల్ వస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘#BB3’. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోండగా, మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నట్లు సమాచారం. స్పెషల్ సెట్ వేసి సీన్లు చిత్రీకరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

సినిమా నుంచి విడుదలైన బాలయ్య క్లాసీ లుక్‌తో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సినిమాలో నటించడంపై తాజాగా హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ స్పందించింది. బాలకృష్ణతో స్క్రీన్ పంచుకోవడం అద్భుతంగా ఉందని, ఆయన ఎనర్జీ పవర్‌హౌజ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన ‘జయ జానకి నాయక’ లో ఓ పాత్ర పోషించిన ప్రగ్యా..ప్రజెంట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా పట్ల విజన్ ఉన్న డైరెక్టర్ బోయపాటి అని చెప్పింది. కొవిడ్ మహమ్మారి క్లిష్ట పరిస్థితుల తర్వాత తాను నటిస్తున్న మొదటి చిత్రమిదని, తనకెంతో స్పెషల్ అని పేర్కొంది.


Next Story

Most Viewed