సరిహద్దు జిల్లాలో ప్రత్యేక ద‌ృష్టి

by  |
సరిహద్దు జిల్లాలో ప్రత్యేక ద‌ృష్టి
X

దిశ తెలంగాణ బ్యూరో: సరిహద్దు జిల్లాలో కొవిడ్ వ్యాధి వ్యాప్తిని నియంత్రిచేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం, మధిర, సత్తపల్లి, అలంపూర్, గద్వాల, నారాయణపేట, మక్తల్, నాగార్జున సాగర్, కోదాడ, హుజుర్‌నగర్ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తిని తగ్గించేందుకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల హెలికాఫ్టర్ ద్వారా పర్యటనలు చేపట్టారు. మంగళవారం ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సీఎం ఓఎస్డీ గంగాధర్ లు హెలికాఫ్టర్ లో సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామాలను పరిశీలించిన అనంతరం సరిహద్దు జిల్లాలోని కలెక్టర్లలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పలు ఆదేశాలను జారీ చేశారు.

ప్రతి కేంద్రాల పరిధిలో రోజుకు తప్పనిసరిగా నిర్వహించాలని 300 టెస్ట్‌లను సూచించారు. గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి ఆశావర్కర్ల సాయంతో ఇంటింటికి తిరిగి వ్యాధి అనుమానితులను గుర్తించి టెస్ట్‌లు చేపట్టాలని చెప్పారు. టెస్టింగ్, ట్రెసింగ్, ట్రీట్ మెంట్ విధానాలను చేపట్టి వ్యాధి వ్యాప్తిని నియంత్రించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పేషెంట్లు అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి అనువైన ప్రదేశాల్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ మేరకు చర్యలను యుధ్ద ప్రాతిపాధిక చేపట్టి వ్యాధివ్యాప్తిని అదుపులోకి తీసుకురావాలని సూచించారు.


Next Story

Most Viewed