వివేకా హత్య కేసులో ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు

by  |
వివేకా హత్య కేసులో ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు
X

దిశ, వెబ్‎డెస్క్: వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు ఢిల్లీలోని స్పెషల్ క్రైమ్ బ్రాంచ్‎కు అప్పగించారు. ప్రత్యేక నేరా దర్యాప్తు విభాగానికి చెందిన థర్డ్ బ్రాంచ్ డీఎస్పీ దీపక్‎గౌర్‎కు బాధ్యతలు అప్పగించారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం అభియోగంతో సీబీఐ రీ- రిజిస్ట్రేషన్‌ చేసింది. మొదట వివేకా మృతిని సీఆర్పీసీ 174 సెక్షన్ కింద.. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం త్వరలో కొత్త బృందం రానుంది.


Next Story