శాసనసభ ప్రాంగణంలో జెండావిష్కరణ చేసిన స్పీకర్​

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆదివారం ఉదయం శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని, రాష్ట్ర ప్రజలందరికి స్పీకర్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పారు. అదేవిధంగా శాసన మండలి ఆవరణలో చైర్మన్‌ భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు [&hellip;]</p>

శాసనసభ ప్రాంగణంలో జెండావిష్కరణ చేసిన స్పీకర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆదివారం ఉదయం శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని, రాష్ట్ర ప్రజలందరికి స్పీకర్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పారు. అదేవిధంగా శాసన మండలి ఆవరణలో చైర్మన్‌ భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అసెంబ్లీలోని జాతిపిత మహాత్మాగాంధీకి మండలి చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, శాసనసభ అధికారులు పాల్గొన్నారు

Next Story