గూడురులో గుప్పుమన్న గంజాయి.. నలుగురు అరెస్టు

by  |
గూడురులో గుప్పుమన్న గంజాయి.. నలుగురు అరెస్టు
X

దిశ, గూడూరు : గూడూరు మండలంలోని కొబాల్ తండా గ్రామ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకార.. షేక్ ఇస్మాయిల్, దారంసోత్ శ్రీను, ధరావత్ కిరణ్ కుమార్, పల్లికొండ సాంబమూర్తి ఈ నలుగురు కలిసి చాలా రోజులుగా వైజాగ్‌‌కు చెందిన ఒక వ్యక్తి నుండి గంజాయిని తెప్పించుకుని వేర్వేరు ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గంజాయి అక్రమ రవాణా కోసం ధరావత్ శ్రీను ఇంటి వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గూడూరు పోలీసులు వారిని పట్టుకొని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. నిందితుల నుంచి 102 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకున్నట్టు తెలిపారు. దీని విలువ సుమారుగా 10 లక్షలు ఉంటుందని సమాచారం. గంజాయి తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. అక్రమ గంజాయిని పట్టుకున్న గూడూరు ఎస్‌ఐ సతీష్, పోలీస్ సిబ్బంది బిచ్చ నాయక్, రవి, ఐలయ్య సోమేశ్వర్, దామోదర్‌, ఈ కేసును పర్యవేక్షించిన గూడూరు సీఐ రాజరెడ్డి, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్‌లను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.

కుటుంబాలు నాశనం అవుతున్నాయి : ఎస్పీ కోటిరెడ్డి

గంజాయికి అలవాటు పడి యువత తప్పుదారి పడుతున్నారు. గంజాయి అలవాటు పడిన వారిలో అనేక మానసిక, శారీరక సమస్యలు వచ్చి కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి. యువత గంజాయి మత్తులో అనేక నేరచర్యలకు పాల్పడుతున్నారు. కావున ప్రజలు, యువత గంజాయిని దూరంగా ఉండి నేటి సమాజాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అక్రమంగా గంజాయిని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


Next Story

Most Viewed