వారి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సోనూసూద్

by  |
Sonu Sood
X

దిశ, సినిమా: లాక్‌డౌన్‌లో లక్షల మందికి సాయం అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోను సూద్.. ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన మహిళను ఎయిర్ బస్ ద్వారా హైదరాబాద్‌కు తరలించి, తనకు అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఓ హిందీ చానల్‌ ‘డ్యాన్స్ దివానే’ ప్రోగ్రామ్‌లో వీడియో క్లిప్పింగ్ ప్లే చేశారు. ఈ క్రమంలో తన నుంచి సాయం పొందిన మహిళ, ఆమె కుటుంబ సభ్యులు సోనును దేవుడిగా అభివర్ణించారు. తను లేకపోతే బిడ్డ బ్రతికేది కాదని, దేవుడి రూపంలో కాపాడేందుకు వచ్చాడని ధన్యవాదాలు తెలిపారు. దీంతో వారి మాటలు విన్న సోను కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Next Story

Most Viewed