- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు సినిమాలో 'పశుపతి'
<p>‘అమ్మ.. బొమ్మాళి’ అంటూ అరుంధతి సినిమాలో పశుపతి పాత్రకు ప్రాణం పోసిన నటుడు సోనూసుద్. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ టాలెండెట్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుంధతి సినిమా సోనూసుద్‌ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందనడంలో సందేహం లేదు. అతడు, జులాయి, దూకుడు, కందిరీగ, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో స్టైలిష్ విలన్‌గానూ మెప్పించాడు. చివరగా అభినేత్రి సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించిన ఆయన..ఇప్పుడో క్రేజీ ఆఫర్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల […]</p>

‘అమ్మ.. బొమ్మాళి’ అంటూ అరుంధతి సినిమాలో పశుపతి పాత్రకు ప్రాణం పోసిన నటుడు సోనూసుద్. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ టాలెండెట్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుంధతి సినిమా సోనూసుద్‌ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందనడంలో సందేహం లేదు. అతడు, జులాయి, దూకుడు, కందిరీగ, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో స్టైలిష్ విలన్‌గానూ మెప్పించాడు. చివరగా అభినేత్రి సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించిన ఆయన..ఇప్పుడో క్రేజీ ఆఫర్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిరు 152 మూవీలో కీలక పాత్రను చేజిక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సోనూయే ధృవీకరించాడు. చిరుతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. సౌత్ ఇండస్ట్రీ నాకు చాలా గుర్తింపునిచ్చిందని.. మంచి సినిమాలతో తనను అక్కున చేర్చుకున్న తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటానన్నాడు.






