- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరుకు రియల్ హీరో సోనూసూద్ స్నేహహస్తం..
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆపద సమయంలో ఎప్పుడూ తానున్నానంటూ సహాయం అందించే రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదల ధాటికి నెల్లూరు జిల్లా అతలాకుతలం కావడంతో పాటు పలువురు పేద ప్రజలు నష్టపోయారు. దీంతో వారికి సోనూసూద్ తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సుమారు 1500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఆపద సమయంలో ఎప్పుడూ తానున్నానంటూ సహాయం అందించే రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదల ధాటికి నెల్లూరు జిల్లా అతలాకుతలం కావడంతో పాటు పలువురు పేద ప్రజలు నష్టపోయారు. దీంతో వారికి సోనూసూద్ తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సుమారు 1500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగా నిత్యావసర వస్తువులను నెల్లూరు జిల్లాకు పంపనున్నారు. శనివారం పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సోనూసూద్ మిత్రులు సమీర్ ఖాన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతికి కూడా సోనూసూద్ సాయం చేయనున్నారు. ఇకపోతే నెల్లూరు జిల్లాకు ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్ అందించిన సోనూసూద్ వరదల్లో సహాయంలో మరోసారి తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు రావడం ఆయన ఉదారతకు అద్దం పడుతోందని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు.






