వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌కు షాక్

by  |
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌కు షాక్
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్‌కు ఇటాలియన్ ఆటగాడు లోరెంజో సొనెగొ షాక్ ఇచ్చాడు. శుక్రవారం వియన్నాలో జరిగిన ఈస్ట్ బ్యాంక్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో 6-2, 6-1 తేడాతో జకోవిచ్‌ను ఓడించి లోరెంజో సెమీస్‌లోకి ప్రవేశించాడు. ఇదే ఇతనికి తొలి సెమీస్ కావడం గమనార్హం. డియాగో ష్క్వార్జ్‌మెన్ టోర్నీ నుంచి వైదొలగడంతో ఆఖరి నిమిషంలో లోరెంజోకు డ్రాలో అవకాశం వచ్చింది. ఈ టోర్నీ ఆసాంతం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా క్వార్టర్స్‌కు చేరుకున్న లోరెంజో.. ఈ మ్యాచ్‌లో కూడా ఒక్క సెట్ కోల్పోకుండా జకోవిచ్‌ను ఓడించాడు. ఈ ఓటమితో జకోవిచ్ తన ర్యాంక్‌ను కోల్పోయే అవకాశం ఏర్పడింది.

Next Story

Most Viewed