టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన అన్షు మాలిక్, సోనమ్ మాలిక

92

దిశ, స్పోర్ట్స్ :భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ టోక్యో ఒలంపిక్స్ – 2020 కి అర్హత సాధించారు. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియన్ ఒలంపిక్ క్వాలిఫయర్స్ పోటీల్లో శనివారం అన్షు, సోనమ్ సీనియర్ విభాగంలో అర్హత సాధించి ఒలంపిక్స్ బెర్త్ దక్కించుకున్నారు. ఈ సారి ఒలంపిక్స్ రెజ్లింగ్‌లో భారత్ తరపున వీరిద్దరితో పాటు వినేష్ ఫొగట్ (53 కేజీలు) పాల్గొంటున్నారు. వినేష్ 2019 వరల్డ్ చాంపియన్‌షిప్ ద్వారా క్వాలిఫై అయ్యింది. అన్షు 57 కేజీల విభాగంలో, సోనమ్ 62 కేజీల విభాగంలో పోటీపడనున్నారు.

పురుషుల్లో భజరంగ్ పునియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), దీపక్ పునియా (86కేజీలు) ఇప్పటికే మెన్స్ ఫ్రీస్టైల్ విభాగంలో క్వాలిఫై అయ్యారు. రియో ఒలంపిక్స్‌లొ పతకం సాధించిన సాక్షి మాలిక్ ఈ సారి ఒలంపిక్స్‌కు క్వాలిఫై కాకపోవడం గమనార్హం. 62 కేజీల విభాగంలో పోటీ పడుతున్న సాక్షి మాలిక్‌ను ఇటీవల జరిగిన ట్రయల్స్‌లో నాలుగు సార్లు సోనమ్ ఓడించింది. దీంతో సోనమ్‌కే ఒలంపిక్ బెర్త్ దొరికింది. వీరిద్దరూ క్వాలిఫై కావడంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..