బిగ్ స్క్రీన్ అనుభవం అద్భుతం : సోనమ్

by  |
బిగ్ స్క్రీన్ అనుభవం అద్భుతం : సోనమ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా సోనమ్ కపూర్.. ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకుని లండన్‌లో ఉంటున్నట్లు తెలిసిందే. కరోనా కారణంగా ఇన్నాళ్లుగా మూతపడిన సినిమా థియేటర్లు.. పరిస్థితులు సాధారణమయ్యాక తెరుచుకోవడంతో సినిమా చూసేందుకు వెళ్లినట్లు తెలిపింది. మాస్క్ వేసుకున్న ఫొటోతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేసిన సీటింగ్ అరేంజ్‌మెంట్స్ గురించి కూడా ఒక పిక్ షేర్ చేసింది సోనమ్.

చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్‌పై తొలిసారి ‘టెనెట్’ సినిమా చూసేందుకు వెళ్లినట్లు చెప్పింది. ఇక్కడ రెండు విషయాలు జరిగాయని.. ఫస్ట్ థియేటర్‌లో సినిమా చూస్తున్నంతసేపు అద్భుతమైన, అసమానమైన అనుభవం కలిగిందని తెలిపిన సోనమ్.. సెకండ్ ‘టెనెట్‌’లో డింపుల్ కపాడియాను చూసి గూస్ బంప్స్ వచ్చాయని తెలిపింది. చిత్రంలో డింపుల్ కపాడియాకు సంబంధించిన ఒక పిక్ కూడా షేర్ చేసింది సోనమ్.

https://www.instagram.com/p/CEhkB25FXxl/?igshid=1dld3srve4wgg

దీనిపై స్పందించిన తాప్సీ పన్ను.. కొత్త లేక పాత సాధారణమని కాదు.. సినిమాను జస్ట్ చూశామా, వెళ్లామా అని కాకుండా సినిమాను అనుభూతి చెందినప్పుడు సాధారణం అవుతుందని తెలిపింది. త్వరలో తను కూడా థియేటర్‌లో సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.



Next Story

Most Viewed