- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై సోనమ్ గుస్సా
<p> ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై మండిపడ్డారు బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. మోహన్ భగవత్ వ్యాఖ్యలు సమాజ తిరోమనానికి దారి తీసే ప్రమాదం ఉందని మండిపడ్డారు. తెలివి ఉన్న మనిషి ఎవరైనా ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశానికి హాజరయ్యారు మోహన్ భగవత్. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సభ్యులు, వారి కుటుంబీకులు […]</p>

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై మండిపడ్డారు బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. మోహన్ భగవత్ వ్యాఖ్యలు సమాజ తిరోమనానికి దారి తీసే ప్రమాదం ఉందని మండిపడ్డారు. తెలివి ఉన్న మనిషి ఎవరైనా ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశానికి హాజరయ్యారు మోహన్ భగవత్. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సభ్యులు, వారి కుటుంబీకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ మధ్య విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య పెరిగిపోతుందన్నారు. చదువు, సంపద ఉన్న కుటుంబాల్లోనే విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. విద్య, డబ్బు అహంకారానికి దారి తీస్తుందని, కుటుంబాలు విడిపోయేందుకు కారణం అవుతున్నాయని, ఇది సమాజం మీద ప్రభావం చూపిస్తుందన్నారు. ఇండియా హిందూ సమాజంలాగే ఉండాలని, హిందూ సమాజం కుటుంబంలా ప్రవర్తించాలని, మరోమార్గం లేదన్నారు భగవత్. ఈ వ్యాఖ్యలపై మండిపడిన సోనమ్ తెలివి తక్కువ మాటలు మాట్లాడొద్దని హెచ్చరించింది.






