- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > టెన్షన్.. టెన్షన్.. సూసైడ్ చేసుకుంటున్నా.. పేరెంట్స్‌కు కొడుకు సెల్ఫీ వీడియో
టెన్షన్.. టెన్షన్.. సూసైడ్ చేసుకుంటున్నా.. పేరెంట్స్‌కు కొడుకు సెల్ఫీ వీడియో
<p>దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం యువకుడి సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. మండలంలోని అంబటిపల్లి గ్రామానికి చెందిన వావిలాల రాజేందర్ అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానని ఆదివారం సెల్ఫీ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, అతని కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో చూసిన వెంటనే పరిసర గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి […]</p>

X
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం యువకుడి సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. మండలంలోని అంబటిపల్లి గ్రామానికి చెందిన వావిలాల రాజేందర్ అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానని ఆదివారం సెల్ఫీ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, అతని కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో చూసిన వెంటనే పరిసర గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి యువకుడి కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పోలీసులు.. వెతుకుతుండగా అతడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడు కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం వీడియో పంపించారా.? లేక నిజంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడా.? అనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
Next Story






