మా నాన్నను కాపాడుకోవడానికి సాయం చేయండి

by  |
మా నాన్నను కాపాడుకోవడానికి సాయం చేయండి
X

దిశ, అచ్చంపేట : మా నాన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే 2 లక్షల రూపాయల ఖర్చు చేశామని.. మా నాన్న ఎలిమినేటి సాయిలును బతికించుకోవడానికి దాతలు ఎవరైనా సాయం చేయాలని కొడుకు ఎలిమినేటి అరవింద్ సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధి పదరా మండలం పరిధిలోని వంకేశ్వరం గ్రామానికి చెందిన ఎలిమిలేటి సాయిలు ఈనెల 9న అమ్రాబాద్ మండల కేంద్రంలో ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రస్తుతం హైదరాబాదులోని వెల్నెస్ హాస్పిటల్ హైడ్‌లో ఐసీయూ కేర్‌లో చికిత్స పొందుతున్నాడు.

సర్వైకల్ వెన్నెముకకు గాయం, పక్కటెముకల ఫాక్చర్ (బోన్ ఫ్యాక్చర్), ఊపిరితిత్తులలో రక్తస్రావం వంటి సమస్యలతో పోరాడుతున్నాడు. వైద్య ఖర్చులకు మేము సుమారు రూ. 2 లక్షలు పొదుపు మరియు రుణాల నుంచి మొత్తాలను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించామని, అయినా పరిస్థితి విషమంగానే ఉందని రాబోయే కొద్ది రోజుల్లో తదుపరి చికిత్స కోసం రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారని కొడుకు అరవింద్ వెల్లడించాడు. కావున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తోచిన సహాయం అందించి మా నాన్నను కాపాడాలని కోరాడు. దాతలు 630222306, 8897915703 గూగుల్ పే మరియు ఫోన్ పే ద్వారా సహాయం చేయగలరని విజ్ఞప్తి చేశాడు.



Next Story

Most Viewed