పోర్న్ వీడియోలు ధ్వంసం.. తల్లిదండ్రులపై కేసు

by  |
పోర్న్ వీడియోలు ధ్వంసం.. తల్లిదండ్రులపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్తిలో వాటా కోసం తల్లిదండ్రులు మీద కేసులు వేయడం చూసుంటారు. కానీ తాను కష్టపడి కలెక్ట్ చేసుకున్న పోర్న్ సినిమాల కలెక్షన్‌ను ధ్వంసం చేశారని ఓ కొడుకు ఏకంగా తన పేరెంట్స్ మీద కేసు వేయడం నిజంగా విడ్డూరమే. ఇదే ఆశ్చర్యం అనుకుంటే.. కోర్టు తీర్పు కూడా ఆ సుపుత్రుడికి అనుకూలంగా వచ్చింది. ఇంతకీ ఇదెక్కడ జరిగింది? ఆ పుత్రరత్నం ఎవరు?

పోర్న్ వీడియోలకు అడిక్ట్ కావడం వల్ల చాలా మంది తమ జీవితాన్ని కొల్పోయిన సందర్భాలున్నాయి. అమెరికా, మిచిగాన్‌కు చెందిన 42 ఏళ్ల డేవిడ్ వెర్కింగ్‌ కూడా ఆ జాబితాలోకే వస్తాడు. తను పోర్న్ వీడియోలకు అలవాటు పడటమే కాదు, అనేక వెబ్‌సైట్లు వెతికి వీడియోలను సేకరించే వాడు. అతడి కలెక్షన్స్‌లో భాగంగా మేగజైన్స్, సెక్స్ టాయ్స్, పోర్న్ డీవీడీల కోసం మొత్తంగా 25 వేల డాలర్లు (దాదాపు 18 లక్షల రూపాయలు) ఖర్చు చేశాడు. తనకున్న సెక్స్ వీడియోల అడిక్షన్ కారణంగా భార్య కూడా విడిచివెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఒంటరిగా కాలం గడుపుతున్న డేవిడ్‌ను అతడి తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. తమ కొడుకు జీవితం నాశనం కావడానికి అతడికున్న పోర్న్ అడిక్షన్ కారణమని తెలుసుకొని, వారు ఆ కలెక్షన్ మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల పోరు పడలేని డేవిడ్.. 2018లో తిరిగి ఇండియానాకు వెళ్లిపోయాడు. వెళ్లేటపుడు 12 పెట్టల నిండా ఉన్న పోర్నోగ్రఫీ, రెండు పెట్టెల నిండా ఉన్న సెక్స్ టాయ్స్ నుంచి కొద్ది మొత్తాన్ని తీసుకెళ్లాడు. తిరిగి 2019లో ఇంటికి రాగా, తాను వదిలివెళ్లిన 1600కు పైగా డీవీడీలు, వీడియోలు, సెక్స్ టాయ్స్, మేగజైన్స్ కనిపించకుండ పోవడంతో తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అవన్నీ నాశనం చేశామని తల్లిదండ్రులు చెప్పడంతో, తన వస్తువులను అక్రమంగా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ తల్లిదండ్రులపై 2019 ఏప్రిల్‌లో కోర్టు కేసు వేశాడు.

ఈ కేసు తీర్పు తాజాగా వెలువడగా.. ఇంటికి తల్లిదండ్రులు యజమానులే అయినా, కొడుకు వస్తువులను ధ్వంసం చేసే హక్కు వారికి ఎంతమాత్ర లేదని జడ్జి తన తీర్పులో చెప్పడంతో పాటు, డేవిడ్‌కు ఎంత నష్టం జరిగిందో ఫిబ్రవరిలోపు కోర్టుకు వివరాలు సమర్పించాలని తీర్పునిచ్చాడు. దాంతో డేవిడ్‌కు జరిగిన నష్టం ఎంతో తెలుసుకోవడానికి నెవడాలోని ఒక మ్యూజియం నిపుణుడి సాయం తీసుకుంటున్నట్లు ఆయన తల్లిదండ్రులు తెలిపారు.

Next Story

Most Viewed