చెంప దెబ్బతో తల్లి ప్రాణం తీసిన కొడుకు (వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2021-03-16 23:14:19  IST  )

<p>దిశ,వెబ్ డెస్క్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ఆమె&#8230; కొడుకును ప్రయోజకుడిని చేయడం కోసం పగలు రాత్రి కష్టపడిన మాతృమూర్తి ఆమె &#8230; అలాంటి తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటున్న కొడుకులు ఎంతమంది ఈ సమాజంలో? తమ కోసం వారి జీవితాలనే పణంగా పెట్టిన వారిని మంచిగా చూసుకుకోకపోవడం పక్కన పెడితే వారిపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు కొడుకులు. నాలుగు మెతుకులు వారికి పెట్టలేక వారిని వీధుల్లో అనాధలుగా వదిలేస్తున్నారు. అదీ కుదరకపోతే చివరకు జన్మనిచ్చిన [&hellip;]</p>

చెంప దెబ్బతో తల్లి ప్రాణం తీసిన కొడుకు (వీడియో)
X

దిశ,వెబ్ డెస్క్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ఆమె… కొడుకును ప్రయోజకుడిని చేయడం కోసం పగలు రాత్రి కష్టపడిన మాతృమూర్తి ఆమె … అలాంటి తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటున్న కొడుకులు ఎంతమంది ఈ సమాజంలో? తమ కోసం వారి జీవితాలనే పణంగా పెట్టిన వారిని మంచిగా చూసుకుకోకపోవడం పక్కన పెడితే వారిపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు కొడుకులు. నాలుగు మెతుకులు వారికి పెట్టలేక వారిని వీధుల్లో అనాధలుగా వదిలేస్తున్నారు. అదీ కుదరకపోతే చివరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఒక తల్లిని ఒక కొడుకు కర్కశంగా కొట్టి చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే ఢిల్లీకి చెందిన అవతార్ కౌర్ అనే 76 ఏళ్ళ వృద్ధురాలు కొడుకు , కోడలుతో కలిసి ఉంటుంది. ఐతే సోమవారం వృద్ధురాలికి, పక్కింటివారికి పార్కింగ్ స్థలం విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పక్కింటివారు కౌర్ ని, ఆమె కొడుకును అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో తల్లి వలనే పక్కింటివారితో మాటలు పడాల్సి వస్తుందని ఆగ్రహించిన కసాయి కొడుకు ఎదురుగా ఉన్న తల్లి చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నతల్లి పై విచక్షణా రహితంగా చేయి చేసుకొని ఆమె మృతికి కారణమైన కొడుకును అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story