‘సోలో బ్రతుకే సో బెటర్’.. ఏం చెప్పావ్? ఏం చేశావ్?

by  |
‘సోలో బ్రతుకే సో బెటర్’.. ఏం చెప్పావ్? ఏం చేశావ్?
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ అవెయిటెడ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సూపర్ హిలేరియస్ ట్రైలర్ ఓపెనింగ్‌లోనే స్టూడెంట్స్ అందరూ కలిసి హీరో సాయి ధరమ్ తేజ్ కటౌట్‌ను కాల్చేయడం చూపించారు. ఇంతకు ఆ కటౌట్ ఎందుకు కాల్చేశారో తెలుసా? సింగిల్‌ లైఫ్‌లోనే స్వేచ్ఛ ఉంటుందని, అలాగే బతకమని హితోపదేశం చేస్తూ అప్పటిదాకా పలు జంటలను విడదీసిన తేజ్.. చివరికి ఓ అందమైన అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి మింగిల్ అయిపోతాడు. అలా తమను సింగిల్స్‌గా మిగిల్చేసి తాను మాత్రం లవ్‌‌ను ఎంజాయ్ చేస్తున్నాడనే కోపంతో కటౌట్ కాల్చేస్తారు స్టూడెంట్స్.

పెళ్లి, పెళ్లాం లాంటి పదాలకే దూరంగా ఉండాలని మామ రావు రమేష్ దగ్గర చిన్నప్పటి నుంచి పాఠాలు నేర్చుకున్న తేజ్.. బ్రహ్మచారిగా మిగిలిపోయిన ఆర్.నారాయణ మూర్తి గారి ఆదర్శంతో సింగిల్‌గా ఉండిపోదామనుకుని డిసైడ్ అయిపోయాడు. కానీ నారాయణ మూర్తిగారే ‘మనిషి ప్రకృతి ధర్మాన్ని ఆచరించాలి.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.. పెళ్లి చేసుకోవాలి’ అని చెబితే, గురువుగారు చెప్పిన మాటలను ఫాలో అయిపోయాడా? నభా నటేష్ ప్రేమలో పడిపోయాడా? పడిపోయాక తేజ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనేది ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్ వేలో చూపించాడు డైరెక్టర్ సుబ్బు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన సినిమా థియేటర్లలో క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుండగా, ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.


Next Story